శ్రీ ప్రసన్న వరదరాజుల స్వామి దేవాలయము పునర్నిర్మాణం పనులను భాగంలో కాంక్రీటు వర్క్ పనులును ప్రారంభించిన శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు .
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానమునకు అనుబంధ ఆలయమైన శ్రీ ప్రసన్న వరదరాజుల స్వామి దేవాలయము పునర్నిర్మాణం పనులను భాగంలో కాంక్రీటు బెడ్ వర్క్ పూజారి కార్యక్రమంతో శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు పనులును ప్రారంభించారు. శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు మాట్లాడుతూ శ్రీ ప్రసన్న వరదరాజుల స్వామి దేవాలయము పునర్నిర్మాణం పనులను భాగంలో కాంక్రీటు బెడ్ వర్క్ పనులను ఈరోజు ప్రారంభించారు. ఈ యొక్క కాంక్రీట్ పని రెండు రోజుల్లో పూర్తి చేసిన తర్వాత అనంతరం గర్భాలయం ప్రాంతంలో రాతి బ్లాక్స్ నిర్మాణము పనులు చేపట్టారు అని తెలియజేశారు. నాణ్యత ప్రమాణాలు ఏమాత్రం తగ్గకుండా అత్యంత నాణ్యతగా కాంక్రీట్ పనులు జరుగుతుందని తెలియజేశారు. అనంతరం దేవస్థానం ఇంజనీరింగ్ అధికారులకు మరియు కాంట్రాక్టర్కు సమన్వయం చేసుకుంటూ పనులను చేపట్టాలని సూచించారు ఈ కార్యక్రమంలో దేవస్థానం ఇంజనీరింగ్ శాఖ అధికారులు ఈఈ మురళీధర్ రెడ్డి, ఏఈ కిషోర్ కుమార్, స్థపతి కుమార్, వర్కింగ్ స్పెక్టర్ సూర్య ప్రసాద్, కాంట్రాక్టర్ యువ కిషోర్, విజయ్ భాస్కర్ రెడ్డి మరియు దేవస్థానం అర్చకులు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment