ప్రమీలమ్మ గారిచే అంతర్జాతీయ ఎయిడ్స్ కొవ్వుొతుల స్మారక దినోత్సవం
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
ఈ రోజు శ్రీకాళహస్తి పట్టణం సంత మైదానం యస్. సి. కాలని యందు స్టేప్స్ సంస్థ డైరెక్టర్ డాక్టర్ ప్రమీలమ్మ గారిచే అంతర్జాతీయ ఎయిడ్స్ కొవ్వుొతుల స్మారక దినోత్సవం నిర్వహించడమైనది. ఈ కార్యక్రమం లో ఎయిడ్స్ జబ్బు చే మరణించిన వారికి దీపాలు వెలిగించి, వారి ఆత్మలకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థంచడమైనది. అదేవిధంగా వారి కుటుంబ సభ్యులకు ఆయురారోగ్యలు తో పాటు మానసిక స్థైర్యం కలగాలని తెలిపారు. ప్రతి సంవత్సరం మే నెల మూడవ ఆదివారం ప్రపంచ వ్యాప్తంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. తదనంతరం ప్రజల తో పాటు మౌనంగా రాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమం లో ఏరియా హాస్పిటల్ కౌన్సిలర్ భారతి, సంస్థ సిబ్బంది రమేష్, గాయత్రి, సురేష్, దేవేంద్ర, ప్రజలు పాల్గొన్నారు.
No comments:
Post a Comment