విద్యార్థులకు సత్కారం :నవభారత్ యువజన సంఘం
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
శ్రీకాళహస్తి వంశీ జూనియర్ కళాశాలకు చెందిన విద్యార్థులు ఇంటర్మీడియట్ పరీక్షల్లో అత్యున్నత ప్రతిభ కనబరిచారు ఈ సందర్భంగా విద్యార్థులను నవభారత్ యువజన సంఘం ఆధ్వర్యంలో ప్రోత్సాహక అభినందన సభ ఏర్పాటు చేశారు. ఎంపీసీ బైపీసీ సీఈసీ గ్రూపుల్లో అత్యున్నత ప్రతిభ చూపి మార్పులు సాధించిన విద్యార్థులను గరికపాటి రమేష్ బాబు ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా నవ భారత యువజన సంఘం అధ్యక్షులు గరికపాటి రమేష్ బాబు మాట్లాడుతూ తమ సంస్థ సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందని, విద్యార్థులను ప్రోత్సహించి వారు తమ లక్ష్యాలను అందుకునే దిశగా అభినందనలు తెలుపుతున్నామన్నారు. మిమ్మల్ని చూసి మరో పది మంది స్ఫూర్తి పొంది కష్టపడి మంచి మార్కులు తెచ్చుకోవాలన్నారు. న్యాయవాది రాజేశ్వరరావు మాట్లాడుతూ విద్యార్థులు చదువులతోపాటు లోకజ్ఞానాన్ని కూడా అలవర్చుకోవాలని సూచించారు. న్యాయవాది ప్రజ్ఞ శ్రీ మాట్లాడుతూ ఇంటర్ తర్వాత ఏమి చదవాలనేది ఆలోచన చేయాలని బీటెక్ ఒకటే కాదు మరెన్నో కోర్సులు అందుబాటులో ఉన్నాయని ఆలోచన చేయాలని సూచించారు. కళాశాల కస్పాండెంట్ రవీంద్ర ప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థులు జీవిత లక్ష్యాన్ని నిర్దేశించుకుని పట్టుదలతో ముందుకు సాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నవభారత యువజన సంఘం సభ్యులు వాసు యాదవ్, ఢిల్లీ కుమార్, కళాశాల ప్రిన్సిపాల్ శ్రీకాంత్ శర్మ, కళాశాల అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment