ఇంటి ముందు పరువు తీస్తున్నారు - స్వర్ణముఖి న్యూస్

 స్వర్ణముఖి న్యూస్

NEWS

Breaking

Home Top Ad

Post Top Ad

Thursday, March 24, 2022

ఇంటి ముందు పరువు తీస్తున్నారు

 ఇంటి పన్ను వసూళ్ల పేరుతో బకాయిదారుల ఇంటి ముందు పరువు తీస్తున్నా పురపాలక శాఖ అధికారుల నిరంకుశ వైఖరికి నిరసనగా బీజేపీ ధర్నా"



స్వర్ణముఖి న్యూస్ ,శ్రీకాళహస్తి

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పెద్దలు,గౌ"శ్రీ, "సోము వీర్రాజు" గారి పిలుపుమేరకు, తిరుపతి పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు గౌ"శ్రీ,"సన్నారెడ్డి దయాకర్ రెడ్డి" గారి సూచన మేరకు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర మీడియా ప్రతినిధి మరియు శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇంచార్జ్ గౌ" శ్రీ,"కోలా ఆనంద్ కుమార్" గారి దిశానిర్దేశంతో 

   శ్రీకాళహస్తి పట్టణ అధ్యక్షులు కాసరం రమేష్ గారి ఆధ్వర్యంలో  పురపాలక శాఖ కార్యాలయం  వద్ద ధర్నా కార్యక్రమం జరిగినది, "కాసరం రమేష్" మాట్లాడుతూ. ఇంటి పన్ను వసూళ్ల  పేరుతో చెల్లింపుదారుల ఇంటి ముందు బకాయిల పేరుతో పురపాలక శాఖ అధికారులు బకాయి దారుల పరువు తీయ్యడం ఎంత వరకు న్యాయం అని,ఈ YSRCP ప్రభుత్వం గద్దెనెక్కినప్పటి నుంచి రాష్ట్ర ప్రజలను "జలగ"లాగా పన్నుల రూపంలో  ప్రజల పై పెను భారం మోపుతూ పైశాచిక ఆనందం పొందడం ఈ ప్రభుత్వానికే చెల్లింది అని పేర్కొనడం జరిగింది,"కరోనా" మహమ్మారితో రాష్ట్ర ప్రజల జీవితాలు అతలాకుతలమైన సందర్భంగా. ఈ రాష్ట్ర ప్రభుత్వం వారి ఆర్ధిక స్థితిగతులు పట్టించుకోకపోగా, ఈరోజు నూతన ఓరవడికతో,నూతన విధివిధానాలతో,"ఇంటి పన్ను"ప్రక్రియ చేపట్టడం ఎంత వరకు సమంజసంఈ మున్సిపల్ అధికారుల తీరు చాలా బాధాకరం, దురదృష్టకరం, శ్రీకాళహస్తి పురపాలక శాఖ పట్టణ పరిధిలో సుమారు  19,619 మంది పై చిలుకు ఇంటి పన్ను చెల్లింపుదారులు ఉన్నారు, వీరిలో ధనికులు ఉన్నారు, నిరుపేదలు ఉన్నారు, ఈరోజు మున్సిపల్ శాఖ సిబ్బంది మరియు సచివాలయ సిబ్బంది సమన్వయంతో SC, ST, మైనారిటీ, OBC వర్గాల "ఇంటి పన్ను" చెల్లింపుదారుల ఇండ్ల వద్దకు తమ సిబ్బందితో కలసి వెళ్లి బకాయిల పేరుతో "MIKE ANNOUNCEMENT" ప్రక్రియ చేపట్టడం చాలా హేయమైన చర్య, ప్రజల జీవితాలతో, ఇంటి పన్ను బకాయిల పేరుతో, ఇంటి వద్దకు వెళ్లి వాళ్ళ మాన, మర్యాదలను, తీస్తున్నటువంటి అధికారులు,నిస్పక్షపాతిగా,జవాబు దారితనంగా, వ్యవహరించ వలసిన అధికారులు.., అదే ధనికుల దగ్గర, వారి వ్యాపార సంస్థల వద్ద ఇదేవిధంగా "MIKE ANNOUNCEMENT"  ప్రక్రియ చేపట్టకపోవడం చాలా బాధాకరం,దురదృష్టకరం అని, "అయినవారికి ఆకులో, కాని వారికి కంచంలో",అన్న విధంగా ఈ మున్సిపల్ అధికారుల తీరు చాలా బాధాకరం అని తెలియజేయడం జరిగినది, ఇకనైనా ఇలాంటి ప్రక్రియకు స్వస్తిపలకాలని,జవాబుదారీతనంగా అధికారులు ఉండాలని ప్రశ్నించడం జరిగినది,అనంతరం మున్సిపల్ కమిషనర్ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. 

               పై ఈ  కార్యక్రమంలో బిజెపి పట్టణ ప్రధాన కార్యదర్శి  వజ్రం కిషోర్, సీనియర్ నాయకులు మరియు బిజెపి రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ చిలక రంగయ్య, సీనియర్ నాయకులు ఈశ్వరయ్య, బిజెపి రాష్ట్ర బిల్డింగ్ వర్కర్స్ అసోసియేషన్ కో కన్వీనర్ సోట్టా సుకుమార్, ఇమ్మడిశెట్టి మోహన్, పట్టణ ఉపాధ్యక్షులు వాసు యాదవ్,L.గోపాల్, ఢిల్లీ బాబు, జిల్లా కార్యవర్గ సభ్యులు కొండేటి గోపాల్, తిరుపతి పార్లమెంటరీ జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు ప్రజ్ఞశ్రీ, బిజెపి OBC పట్టణ అధ్యక్షులు కన్నా వెంకటేశ్వర్లు, తిరుపతి జిల్లా మహిళా నాయకురాలు పద్మజా వాణి, శివమ్మ, బాల గురవయ్యయాదవ్, మణీ,యువ మోర్చా పట్టణ అధ్యక్షులు హరీష్, పట్టణ ప్రధాన కార్యదర్శి భరత్ నాయుడు, పట్టణ ఎస్సీసెల్ అధ్యక్షులు యతీష్, ఈశ్వర్, పట్టణ మైనారిటీ అధ్యక్షులు ఖాదర్,గోపాల్,బాల, డేవిడ్, రవి,ఢిల్లీ, కుమార్ ,అజిత్, రాము,నాని, నరేష్ ,చిన్న,కార్తీక్, సాయి,సురేష్ తదితరులు పాల్గొన్నారు

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad