పన్నుల బకాయిలు అవగాహన కల్పించిన శ్రీకాళహస్తి పురపాలక సంఘ
శ్రీకాళహస్తి పురపాలక సంఘ కమిషనరు బి. బాలాజీ నాయక్ గారి ఆదేశముల మేరకు శ్రీకాళహస్తి పట్టణము నందలి ఇంటి పన్నులు, ఖాళీజాగా పన్నులు మరియు కొళాయి పన్నుల బకాయిలు అధికముగా ఉన్నందున సదరు బకాయిలను వసూలు చేయుటకు గాను పురపాలక సిబ్బంది మరియు సచివాలయ సిబ్బంది వారిని ప్రత్యేక బృందములుగా ఏర్పడి ప్రజలను చైతన్యపరచి అవగాహన కల్పించడము జరిగినది. పన్నులను సకాలములో చెల్లించని యెడల ప్రతి మాసమునకు అపరాధ రుసుముతో పాటుగా చెల్లించవలసివస్తుందని ప్రజలకు తెలియజేశారు. అలాగే కొళాయి పన్నులు అధికముగా ఉన్న పన్నుదారులకు కొళాయి కనెక్షన్ ను తొలగించడము జరుగుతుందన్నారు. ప్రజలు సకాలములో పన్నులు చెల్లించి పురపాలక సంఘ అభివృద్ధికి తోడ్పడాలని తెలియజేశారు. ఈ మేరకు 22 సచివాలయముల నందలి పన్నులు చెల్లించుటకు 22 కౌంటర్ ను ఏర్పాటు చేయడము జరిగినదని, ప్రజలు తమ వార్డు సమీపములోని సచివాలయము నందలి పన్నులు చెల్లించగలరని తెలియజేశారు మరియు శ్రీకాళహస్తి పురపాలక సంఘ కార్యాలయము నందలి పన్నులు చెల్లించుటకు ప్రత్యేకముగా కౌంటర్ ఏర్పాటు చేసి, సెలవు దినములలో కూడా పురపాలక సంఘము మరియు సచివాలయము నందలి ఏర్పాటు చేసిన కౌంటర్ నందు పన్నులను చెల్లించగలరు. ప్రతి ఒక్కరూ చైతన్యవంతులై పన్నులను సకాలములో చెల్లించాలని కోరారు. సదరు కార్యక్రమము నందలి రెవెన్యూ అధికారి పి.యం.వి. నారాయణ రెడ్డి, రెవెన్యూ ఇన్స్పెక్టర్ లు బి. బాల చంద్రయ్య, రవికాంత్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment