చిత్తూరు జిల్లా, శ్రీకాళహస్తి.
న్యాయ వారోత్సవాల్లో భాగంగా జిల్లా కోర్టు వారి ఆదేశాల మేరకు నేడు శ్రీకాళహస్తి పట్టణంలోని తెట్టు దగ్గరలోని నలంద స్కూల్ నందు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసారు. ఈ పాఠశాల ప్రధానఉపాధ్యాయులు , న్యాయవాదులు, లీగల్ ఎయిడ్ కోర్టు సిబ్బంది , పారా లీగల్ వాలంటరీ, విదార్థులు, పాఠశాల అధ్యాపకులు పాల్గొన్నారు,
పారా లీగల్ వాలంటరీ మాట్లాడుతూ... చిన్న పిల్లలు ఇంటినుంచి జాగ్రత్త గా స్కూల్, కి మరియు స్కూల్ నుంచి ఇంటికి జాగ్రత్తగా వేళాలి. పరిసరప్రాంతాలు గమనిస్తూ..సందేహం ఉంటే మీ టీచర్లకు లేదా మాకు ( పారా లీగల్ వాలంటరీ ) తెలిపితే పరిష్కరించుటకు ప్రయత్నిస్తాము అన్నారు.
చట్టాలు, చిన్న పిల్లలు మరియు మహిళా సంరక్షణ ,మహిళలు అక్రమ రవాణా నిర్ములించడంపై అవగాహనా కల్పించారు. వీటి పై తగు,జాగ్రత్తలు సూచనలు తెలిపారు. ముఖ్యముగా చిన్నపిల్లలకు ,మహిళలకు, వృదులకు, న్యాయ సహకారం ఉచితముగా అందిస్తాము. . మీ ఊరి లో ఏ సమస్య వున్నా మాకు తెలపండి అన్నారు. అలాగే న్యాయ సలహాలకు 15100 ఫోన్ నెంబర్ గాని తెలియజేయవలసిందిగా కోరారు.
No comments:
Post a Comment