క్షేత్ర ప్రాశస్త్యం కాపాడుదాం
రాజకీయాలు వద్దు
ధర్మకర్తల మండలి చైర్మన్ అంజూరు శ్రీనివాసులు
దక్షిణ కైలాసంగా రాహు-కేతు క్షేత్రం గా ప్రసిద్ధి చెందిన శ్రీకాళహస్తీశ్వర ఆలయం పవిత్రత కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యత అని శ్రీకాళహస్తి ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ అంజూరు శ్రీనివాసులు మరియు సభ్యులు అన్నారు. రాజకీయాలకతీతంగా రాజకీయ పార్టీలు, స్థానిక లు ఆలయ అభివృద్ధికి నిర్మాణాత్మక సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. శ్రీకాళహస్తి ఆలయంలో గత నాలుగు రోజులుగా విపరీతమైన రద్దీ మూలంగానే నాగ పడగల కొరత ఏర్పడిందని అన్నారు. అనూహ్యమైన రీతిలో భక్తులు విచ్చేశారు అని రోజుకు నాలుగు వేల నుంచి ఐదు వేలు పూజలు జరగడం, మింట్ లో పనిచేసే సిబ్బంది అనారోగ్యం కారణంగా సెలవు పెట్టడం కారణంగా కొంత ఇబ్బంది ఏర్పడినా, తక్షణమే ఆలయ అధికారులు, ధర్మకర్తల మండలి స్పందించి ఏ ఒక్క భక్తుడు కూడా సకాలంలో పూజలు చేసుకోకుండా అసంతృప్తితో వెనక్కి రాకుండా ఉండేలా అప్పటికప్పుడు నాగ పడగ లు తయారు చేయించి అందించడం జరిగిందని వివరించారు. బిజెపి టిడిపి జనసేన పార్టీ నాయకులు లోపాలు తలెత్తినప్పుడు నిర్మాణాత్మక సూచనలు చేస్తే స్వీకరించడానికి ఆలయ అధికారులు, ధర్మకర్తల మండలి సిద్ధంగా ఉందని అలా కాకుండా దీన్ని రాజకీయం చేయడానికి ప్రయత్నిస్తే ఆలయం పై మనమే బురద జల్లుతున్న ట్లు ఉంటుందని ఆలోచించాలన్నారు.
భక్తుల మనోభావాలను కాపాడాలన్న ప్రథమ కర్తవ్యంగా ధర్మకర్తల మండలి పనిచేస్తుందని పేర్కొన్నారు. గతంలో ధర్మకర్తల మండలి లో పనిచేసిన సభ్యుడు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన ఉన్న నాగ పడగలు రొటేషన్ చేశారని ఆరోపించడం ఎంత అసంబద్ధం గా ఉందో తెలుసుకోవాలన్నారు... భక్తితత్వాన్ని పెంచాలి తప్ప శివయ్య సన్నిధిలో తప్పు ఎవరు చేసినా త్రినేత్రుడు నుంచి ఎవరు తప్పించుకోలేరని గుర్తుంచుకోవాలన్నారు. రాజకీయాలు చేయాలంటే ఎన్నో సమస్యలు ఉన్నాయి వాటికి వేరే వేదికలు ఉన్నాయని మన ఆలయం మన బాధ్యతని, భక్తులను గౌరవిస్తూ వారందరికి మన నిర్మాణాత్మక సహకారం అందించాల్సి ఉంది అన్నారు. ఆలయం నాలుగు గోపురాలు ఈవో కార్యాలయం వద్ద ఇకపై ఏ రాజకీయ పార్టీలు ధర్నా చేయడానికి వీలు లేకుండా తమ ధర్మకర్తల మండలి మొదటి సమావేశంలో తీర్మానం చేస్తామన్నారు. ఆలయంలో అనూహ్యమైన రద్దీని దృష్టిలో ఉంచుకొని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి సూచనల మేరకు రాబోయే రోజుల్లో నాగపడగల కొరత అనేది లేకుండా 20 నుంచి 25 వేల నాగ పడగలు ఎప్పుడూ నిల్వ ఉండే విధంగా చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.. ఆలయం పరిధిలో ఇకపై ఏదైనా లోపాలు ఉంటే తమకు కానీ ఆలయ అధికారులు కు వినతిపత్రం రూపంలో కానీ నేరుగా గాని తెలియజేస్తే సమస్యలు పరిష్కరించి భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసే విధంగా స్పందిస్తామని స్థానికులు రాజకీయ పార్టీలు నిర్మాణాత్మక సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ విలేకరుల సమావేశంలో ధర్మకర్తల మండలి సభ్యులు జయాశ్యామ్, మున్నా రాయల్, మహీధర్ రెడ్డి నందా నరసింహులు, పంతులు, లక్ష్మీపతి రమాప్రభ సేన్నీర్ కుప్పం ,పసల కుమారస్వామి,రమేష్ ,కంట ఉదయ్ బాలా గౌడ్, ధన, కళ్యాణ్, ప్రసాద్ పాల్గొన్నారు.
No comments:
Post a Comment