ఫోటో రైట్ అప్ .. సమావేశంలో మాట్లాడుతున్న కోలాటం కళాకారుల అధ్యక్షులు రత్నయ్య
స్వర్ణముఖి న్యూస్ ,శ్రీకాళహస్తి
ప్రసన్న లక్ష్మమ్మ సేవలు ఎనలేనివి.... అధ్యక్షుడు రత్నయ్య
గ్రామీణ ప్రాంతాల జానపద కోలాటం కళాకారులను చైతన్య పరుస్తూ ఎంతోమంది నిరుపేదలకు అండగా నిలిచిన అమ్మ గడ్డం ప్రసన్న లక్ష్మమ్మ సేవలు అభినందనీయమని ఫౌండేషన్ అధ్యక్షుడు రత్నయ్య తెలిపారు . గురువారం పట్టణంలోని ప్రెస్ క్లబ్ నందు పత్రికా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ ప్రసన్నమ్మ జానపద కోలాటం కళాకారుల ఫౌండేషన్ ఫారం అధ్యక్షుడు రత్నయ్య మాట్లాడుతూ కళాకారులకు మా అమ్మ గడ్డం ప్రసన్న లక్ష్మమ్మ ఎనలేని సేవలు చేస్తున్నారు కళాకారులకు గజ్జలు, బట్టలు, పంపిణీ చేస్తూ అందరి ఆదరాభిమానాలు ఉంటున్న మా అమ్మ మా ఆరాధ్య దైవం గురించి తప్పుగా మాట్లాడిన గూడూరు నియోజకవర్గం రాయపనేని రమణయ్య నాయుడు నోరు అదుపులో పెట్టుకోవాలన్నారు. అనవసరంగా నోరు జారితే తగిన గుణపాఠం చెబుతామని.పేద కోలాట కళాకారులకు ఆమె చేస్తున్న సేవలను ఊరు లేక ఆమెపై ఆరోపణలు చేయడం సరికాదని తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇంకొకసారి అమ్మ గురించి తప్పుగా మాట్లాడితే మేము రెండు వేల మంది కళాకారులు అందరం కలిసి మీకు సరైన బుద్ధి చెబుతామన్నారు .ఈ కార్యక్రమంలో పోరం కార్యదర్శి భాస్కర్ కార్యనిర్వాహక సభ్యులు సీతారామయ్య ,వెంకటయ్య ,వెంకటసుబ్బయ్య ,ప్రేమానందం ,తిరుపాల్, గణపతి ,రామయ్య తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment