అంగన్వాడి కేంద్రం నందు పోషణ పక్వాడా కార్యక్రమం
శ్రీకాళహస్తి రూరల్ తొండమనాడు ఎగువవీధిలోని అంగన్వాడి కేంద్రం నందు పోషణ పక్వాడా కార్యక్రమం నిర్వహించారు ,ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీకాళహస్తి శాసనసభ్యులు మధుసూదన్ రెడ్డి కుమార్తె బియ్యపు పవిత్ర రెడ్డి పాల్గొన్నారు.గర్భిణులకు పసుపు, కుంకుమ, పండ్లు, చీరను సారెగా అందజేసి సీమంతంచేశారు. ఆరు నెలలు పూర్తి అయిన పిల్లలకు అన్నప్రాసన చేశారు , ప్రభుత్వం అందజేసిన వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ కిట్ ను పంపిణీ చేశారు.శ్రీపవిత్ర రెడ్డి గారు మాట్లాడుతూ గర్భవతులు తీసుకోవలసిన 1000 రోజుల జాగ్రత్తలను, పోషకాహారాని, ఆరోగ్య పరీక్షలను, ప్రసవా అనంతరం శిశువుల సంరక్షణ , చిన్నారులకు అందించవసిన పౌష్టికాహారం , తల్లీ, బిడ్డకు కలిగే ప్రయోజనాలు గురించి వివరించారు.
సీడీపీఓ శాంతి దుర్గ మాట్లాడుతూ పోషన్ పక్వడా కార్యక్రమo ఈ నెల 21st నుండి ఏప్రిల్ 4 వరకు జరుగుతుంది అని, అన్ని గ్రామంలో పోషణ మీద అవగాహన, పోషకాహార ప్రదర్శన , పిల్లలకు క్విజ్ , elocution పోటీలు, మహిళలకు వంటల పోటీలు , 2k రన్ ప్రోగ్రాం నిర్వహిస్తాము అని తెలిపారు .
ఈ కార్యక్రమంలో, సీడీపీవో శాంతి దుర్గ సర్పంచ్ హేమబుషన్ రెడ్డి ఎం ఈ ఓ భువనేశ్వరి , మరియు మండల వైఎస్ఆర్సీపీ నాయకులు మరియు కార్యకర్తలు,
మండలంలో ఐసీడీఎస్ సూపర్వైసర్ అంగన్ వాడి కార్యకర్తలు పాల్గొన్నారు.
No comments:
Post a Comment