చిత్తూర్ జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని సివిల్ జడ్జి కోర్టు ఆవరణములోని బార్ అసోసియేషన్ భవనం యందు స్టేప్స్ సంస్థ వారి ఆధ్వర్యంలో న్యాయవాదులకు దీర్ఘకాలిక జబ్బు అయినా ఎయిడ్స్ , క్షయ, కేన్సర్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
స్టెప్స్ సంస్థ మేనేజర్ రమేష్ మాట్లాడుతూ..... జబ్బు లక్షణాలు మరియు నివారణ చర్యలు గురించి వివరించడం జరిగింది.
లాయర్ రాజేశ్వరరావు మాట్లాడుతూ... ఎయిడ్స్ నియంత్రణ మరియు నివారణ చట్టం 2017 ప్రకారం ఎయిడ్స్ బాధితుల పట్ల వివక్ష చూపడం, చట్ట ప్రకారం నేరమని అలా చేస్తే దీనికి రెండు సంవత్సరాల జైలు శిక్ష మరియు75వేలు జరిమానా విదించడం జరుగుతుందని తెలిపారు. బాధితులు ఎవరైనా ఉచిత న్యాయ సేవలు పొందగలరని తెలిపారు. ఈ కార్యక్రమంలో లాయర్లు చంద్ర, సుధాకర్ రెడ్డి, రమణ, ఏరియా హాస్పిటల్ టి. బి. అధికారి వనజ, గాయత్రి ఇతరులు పాల్గొన్నారు
No comments:
Post a Comment