ఏరులై పారుతున్న కల్తీ మద్యం - స్వర్ణముఖి న్యూస్

 స్వర్ణముఖి న్యూస్

NEWS

Breaking

Home Top Ad

Post Top Ad

Monday, March 14, 2022

ఏరులై పారుతున్న కల్తీ మద్యం

 కల్తీ మద్యం ఏరులై పారుతున్న ఆంధ్రప్రదేశ్




మద్యపాన నిషేధం ఎప్పుడు అమలుచేస్తావు 


 అక్కచెల్లెమ్మల తాళ్లి బొట్టులు తెంచుతున్న జగన్ రెడ్డి ప్రభుత్వం ...


పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజారపు అచ్చoనాయుడు, వంగలపూడి అనిత ఆదేశాల ప్రకారం బొజ్జల సుధీర్ సహకారం తో తిరుపతి పార్లమెంట్ తెలుగుమహిళా అధ్యక్షులు చక్రాల ఉష ఆధ్వర్యంలో 

  శ్రీకాళహస్తి పట్టణ RTC కూడలి వద్ద డా. బిఆర్ అంబేద్కర్ విగ్రహం ముందు కల్తీ మద్యానికి వ్యతిరేకం గా నిరసన కార్యక్రమం చేపట్టడడం జరిగింది

చక్రాల ఉష మాట్లాడుతూ 

నాటూ సారా, చీప్ లిక్కర్ అమ్ముకుని  సొంత ఆదాయం పెంచుకుంటూ ప్రజల ఆరోగ్యాలతో ఆటలు ఆడుకుంటూ మద్యం ప్రియులు అనారోగ్యపాలవుతూ ఉంటే వేడుక చూస్తున్నారా అని ప్రశ్నించారు ఎన్నడూ లేని విధంగా గంజాయి, నాటు సారా ప్రజలకు విచ్చలవిడిగా లభిస్తూ ఉంటే ప్రభుత్వం నిద్ర పోతోందా అంటూ 

జంగారెడ్డిగూడెంలో 25మంది చనిపోవడం బాధాకరం ఈ మరణాలకు ప్రభుత్వమే కారణం. చంపోయిన వారికి కోటి రూ ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ 

సంపూర్ణ మద్యపాన నిషేధం చేయలేని పక్షంలో తెలుగు మహిళలు పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని డిమాండ్ హెచ్చరించారు 

మహిళలు జగన్ రెడ్డి ఎన్నికల ముందు చెప్పిన (మద్యపాననిషేధం )భూతకపు మాటలు విని మోసపోయారు కూలినాలి చేసుకునే వాళ్ళు ఈ కల్తీ మద్యం వల్ల కడుపులో మంట, లివర్ పాడయ్యి అనారోగ్యపాలవుతున్నారు పెళ్ళాం బిడ్డలకి తిండి కూడా పెట్టలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు వాళ్ళు సంపాదించే మొత్తం సొమ్ము ప్రభుత్వ ఖజానాలో చేరిపోతోంది, కరోనా విపత్కర ఈ పరిస్థితులలో కూడా నిత్యావసర సరుకులు దొరకలేదు మెడిసిన్ దొరకలేదు కానీ ఈ కల్తీ మద్యం మాత్రం విచ్చలవిడిగా సందు గొందుల్లో డోర్ డెలివరీ అవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు సిగ్గులేకుండా ఆ బ్రాండ్ల కి డాక్టర్ ఇంజనీర్ టీచర్స్ అడ్వకేట్ యంగ్ స్టార్స్ స్పెషల్ స్టేటస్ బూమ్ బూమ్ ప్రెసిడెంట్ మెడల్ రాయల్ ఆర్మీ ఆంధ్ర గోల్డ్ అని విచిత్రమైన పేర్లు పెట్టి ఆంధ్ర రాష్ట్రం పరువు తీస్తున్నారు లిక్కర్ అమ్మకాలను కేవలం ఆదాయ వనరుగా చూస్తున్నారని ప్రజలను అనారోగ్యం పాలు చేస్తున్నారని , యువతని చెడుదారి  పట్టిస్తూ మాదక ద్రవ్యాలను పెంచి పోషిస్తూ చాయ్ తాగు లో యువత భవిష్యత్తును నాశనం చేస్తున్నారని దేశంలో ఎక్కడ మత్తు పదార్థాలు దొరికినా అవి ఆంధ్రాలో దొరుకుతున్నాయని చెప్పడం మన దౌర్భాగ్యం అని, గంజాయి సాగులో మనరాష్ట్రం ముందువరుసలో ఉండడం ఈ ప్రభుత్వపని తీరు అద్దం పడుతోందని ఈ పనికిమాలిన ప్రభుత్వానికి చరమగీతం ఏ రోజు త్వరలోనే ఉందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పట్టణ మహిళా అధ్యక్షురాలు సుమతి, కృష్ణవేణి,చంద్రమ్మ , దుర్గ, కుమారి, ఊహ,శ్రీలక్ష్మి,సుజాత తదితరులు పాల్గొన్నారు

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad