ఈరోజు తిరుపతి పార్లమెంట్ జిల్లా శక్తి కేంద్ర ప్రముఖులతో శ్రీకాళహస్తి పట్టణంలోని S.S కళ్యాణ మండపం నందు జిల్లా అధ్యక్షులు శ్రీ సన్నా రెడ్డి దయాకర్ రెడ్డి అధ్యక్షతన సమావేశం నిర్వహించడం జరిగింది.....
ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా జాతీయ కార్యదర్శి మరియు రాష్ట్ర సహ ఇంచార్జ్ శ్రీ సునీల్ దియోధర్ , ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి , రాష్ట్ర ప్రధాన కార్యదర్శిశ్రీ సూర్యనారాయణ రాజు , రాష్ట్ర కార్యదర్శి మరియు తిరుపతి పార్లమెంటు జిల్లా ఇంచార్జ్ కునిగిరి నీలకంఠం , రాష్ట్ర మీడియా ప్రతినిధి శ్రీ కోలా ఆనందకుమార రాష్ట్ర అధికార ప్రతినిధి భాను ప్రకాష్ రెడ్డి , రాష్ట్ర లీగల్ సెల్ కన్వీనర్ సామంచి శ్రీనివాసులు , రాష్ట్ర కార్యదర్శి కండ్రిగ ఉమ తదితర ప్రముఖులు పాల్గొనడం జరిగింది.....
*జిల్లాలోని ప్రతి మండలంలో ఉన్న శక్తి కేంద్రం ప్రముఖులతో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని, పార్టీ బలోపేత దిశలో తీసుకోవాల్సిన చర్యలను, ప్రతి బూత్ ఓటర్ లిస్ట్ ద్వారా ఓటర్ల పర్యవేక్షణ,*
*రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలు పై పార్టీ చేయు పోరాటాల గురించి ,పార్టీ గెలుపు కోసం కార్యకర్తలు ఏ విధంగా ముందుకు వెళ్లాలి అను విషయాల మీద పెద్దలు దిశానిర్దేశం చేయడం జరిగింది*
ఈ కార్యక్రమమంలో తిరుపతి పార్లమెంట్ జిల్లా శక్తి కేంద్రాల ఇంచార్జ్ లు, జిల్లా బీజేపీ నాయకులు భారీ ఎత్తున పాల్గొన్నారు...
No comments:
Post a Comment