భక్తుల రాకపోకలకు ఆటంకం కలిగిస్తే సహించం. అంజూరు శ్రీనివాసులు - స్వర్ణముఖి న్యూస్

 స్వర్ణముఖి న్యూస్

NEWS

Breaking

Home Top Ad

Post Top Ad

Monday, March 21, 2022

భక్తుల రాకపోకలకు ఆటంకం కలిగిస్తే సహించం. అంజూరు శ్రీనివాసులు

 భక్తుల రాకపోకలకు ఆటంకం కలిగిస్తే సహించం. 
ధర్మకర్తల మండలి చైర్మన్ : అంజూరు శ్రీనివాసులు 





స్వర్ణముఖి న్యూస్ ,శ్రీకాళహస్తి . 

శ్రీకాళహస్తి ఆలయం బిచ్చాళ్లా  గాలిగోపురం బయట లోపల దుకాణదారులు రోడ్డుపైకి  విస్తరించుకుని భక్తుల రాకపోకలకు ఇబ్బందికరంగా మారడంతో ఆక్రమణల తొలగింపు చేపట్టారు. మున్సిపల్ అధికారులతో కలిసి ధర్మకర్తల మండలి పర్యవేక్షణలో ఆక్రమణల తొలగింపు నిర్వహించారు. ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో మున్సిపల్, దేవస్థానం అధికారులు తొలుత బిచ్చాళ్ల  గాలిగోపురం  సమీపంలోని పూల దుకాణాల వద్ద వ్యాపారస్తులు తమ తమ దుకాణాలను రోడ్లపై కి  విస్తరించారు. దీంతో ఇక్కడ ఆర్టీసీ బస్సులు నిలవాలన్నా యాత్రికులు నిల్చు కోవాలన్న తీవ్ర ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. 

అంతేకాకుండా ట్రాఫిక్ నిలిచిపోతే బేరి వారి మండపం వరకు ట్రాఫిక్ జాం ఏర్పడి భక్తులు తీవ్ర అవస్థలు పడే పరిస్థితి నెలకొంది. 

 ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకున్నా ఆలయ చైర్మన్ అంజూరు  శ్రీనివాసులు దుకాణాల ఆక్రమణలను తొలగించాలని ఆదేశించారు. భక్త కన్నప్ప ఆలయం భక్తులకు కనబడే విధంగా ఉండాలని, గతంలో ఎక్కడ వరకు  ఇచ్చారో  అక్కడి వరకే వ్యాపారస్తులు దుకాణాలు పెట్టుకోవాలని ఖచ్చితంగా నిబంధన పాటించాలని లేకపోతే పూర్తిగా దుకాణాలు తొలగిస్తామని హెచ్చరించారు. అటు బజార్ వీధిలోనూ కుంకుమ విక్రయ షాపులను ఇతర పూజా ద్రవ్యాల విక్రయ షాపులు రోడ్లపైకి రావద్దని ఆదేశించారు. గాలి గోపురం లోపల వైపు గో పూజ మండపం వరకు విస్తరించిన దుకాణాలు పూర్తిగా భక్తులకు ఇబ్బంది లేని విధంగా వెనక్కి పెట్టుకునే విధంగా చేశారు. మరోసారి భక్తుల రాకపోకలకు ఇబ్బంది కలిగించే విధంగా ముందుకు జరిపి దుకాణాలు పెట్టుకుంటే పూర్తిగా తొలగిస్తామని హెచ్చరిక చేశారు. 

ఆలయ చైర్మన్ అంజూరు శ్రీనివాసులు మాట్లాడుతూ ఆలయ పరిసరాల్లో వ్యాపారం చేసుకునే దుకాణదారులు కు ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి బ్రతుకు జీవనం కోసం అవకాశం కల్పించారని, అయితే భక్తులకు ఇబ్బంది పెట్టొద్దని పలుమార్లు ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి  సూచించిన  వ్యాపారస్తులు రోజు రోజు దుకాణాలు రోడ్లపైకి విస్తరిస్తూ  భక్తుల  ఇబ్బంది పెట్టే విధంగా  విస్తరించడం తగదన్నారు. భక్తులే తమ ప్రథమ ప్రాధాన్యం అని, స్థానికులుగా వ్యాపారులు సహకరించాలని, బతుకు జీవనం సాగిస్తూ సేవా భావంతో వ్యాపారాలు చేసుకోవాలని సూచించారు. అటు ట్రాఫిక్కు ఇబ్బంది లేకుండా ఇటు భక్తుల రాకపోకలకు ఇబ్బంది లేని విధంగా దుకాణాలు నిర్వహిస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవు అని,  అలా కాకుండా తమ ఇష్టారాజ్యంగా దుకాణాలు రోడ్లమీద తీసుకువస్తే పూర్తిగా తొలగించాల్సి వస్తుంది  అన్నారు. 

ఈ విషయంలో ప్రతిపక్ష నాయకులు కూడా తమ సహకారం అందించాలని దీని రాజకీయ దృష్టి చూడకుండా భక్తుల సదుపాయాల కల్పన లక్ష్యంగా అందరం సమిష్టి కృషితో శివయ్యా  దర్శనానికి వచ్చే భక్తులకు అత్యున్నత సదుపాయాలు  కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో లో లో మండలి సభ్యులు బుల్లెట్ జయ శ్యామ్, సాధన మున్నా,  మహీధర్ రెడ్డి 

 మున్సిపల్ కమిషనర్ బాలాజీనాయక్ వన్ టౌన్ ఎస్ఐ సంజీవ్ కుమార్, టెంపుల్ డి ఈ మురళీధరన్, శానిటరీ  ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad