తెలుగుగంగా కాలనీ నందు ఉన్న ప్రభుత్వ మున్సిపల్ హైస్కూల్ నందు *కోటి 20 లక్షల* రూపాయల వ్యయంతో 10 తరగతి గదుల నిర్మాణానికై భూమిపూజ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న
శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి గారి కుమార్తె శ్రీపవిత్ర రెడ్డి బియ్యపు
పవిత్ర రెడ్డి మాట్లాడుతూ శ్రీకాళహస్తి పట్టణంలోని
తెలుగుగంగా కాలనీనందు ఉన్న హై స్కూల్ లో అదనపు తరగతి గదులు కోసం కోటి 20 లక్షల రూపాయల వ్యయంతో నిర్మాణనికై భూమి పూజ కార్యక్రమాన్ని నేడు నిర్వహించామని, తద్వారా విద్యార్థులకు మెరుగైన తరగతి గదులతో పాటు ఆహ్లాదకర వాతావరణంలో విద్యార్థులు విద్యాభ్యాసం నిర్వహించడానికి అనువుగా ఉంటుందని, నాడు నేడు పథకం ద్వారా పాఠశాలలో సుందరికారణంగా తీర్చిదిద్దుతున్న ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ,శ్రీకాళహస్తి దేవస్థాన చైర్మన్ అంజూరు తారక్ శ్రీనివాసులు, పట్టణ అధ్యక్షుడు పగడాల రాజు, జిలాని,గోరా,మురళి యాదవ్,శేఖర్,ఎం.ఇ.ఓ భువనేశ్వరి,స్కూల్ హెచ్.ఎం,ఉపాద్యాయులు, వైస్సార్సీపీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.
No comments:
Post a Comment