పూర్వ విద్యార్థులచే అంజూరు శ్రీనివాసులుకు సన్మానం
శ్రీకాళహస్తి ఆర్.పి.బి.యస్. జెడ్.పి. బాలుర ఉన్నతపాఠశాల పూర్వ విద్యార్థి అయిన అంజూరు తారక శ్రీనివాసులు శ్రీకాళహస్తీశ్వరస్వామి వారి దేవస్థానం ట్రస్టుబోర్డు చైర్మెన్‌గా ఎన్నికైనందుకు గాను వారితో పాటు చదువుకున్న పూర్వ విద్యార్థులు ఏటిఎస్‌ను 13`03`2022 ఆదివారం సాయంత్రం 7`00 గం॥కు వారి స్వగృహమునందు కలసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పూర్వవిద్యార్థి అయిన దినకర్ మాట్లాడుతూ ... శ్రీనివాసులుతో మా స్నేహం విడదీయరానిదని, తరగతి గదిలో సైతం అందరికీ ఆదర్శంగా మెలిగేవారని, కళాశాల చదువుల్లోనే నాయకత్వ లక్షణాలను పుణికిపుచ్చుకొని అటు సేవాపరంగా సాంఘిక సేవా కార్యక్రమాలు చేపడుతూనే, మరోవైపు రాజకీయంగా కూడా తన ఉనికిని చాటుకుంటూ వచ్చారని, ఇన్నేళ్ళ ఆయన కష్టాన్ని, ఆయన సేవలను గుర్తించి ఈరోజు పవిత్రమైన పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వరస్వామి వారి దేవస్థానానికి ట్రస్టుబోర్డుగా నియమించిన శాసనసభ్యులు శ్రీ బియ్యపు మధుసూదన్‌రెడ్డికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని తెలిపారు. అదేవిధంగా చదువుకుంటున్న రోజుల్లోనే ఎంతోమంది పేదవిద్యార్థులకు సహాయమందించారని, కామర్స్ అకాడమీ ద్వారా ఎంతోమంది పేదవిద్యార్థులకు విద్యనందించారని, ఎప్పుడు ఏ అవసరమొచ్చినా స్నేహితులకు ముందు నిలిచి సహాయపడ్డారని తెలియజేశారు. ఆయన అలంకరించిన పదవి మా అందరికీ గర్వకారణమని తెలిపారు.
ఈ కార్యమ్రంలో పూర్వవిద్యార్థులైన పామంజి సురేష్, జి. మోహన్ కిషోర్, వి.ఎల్. లోకనాధం, లక్ష్మీరెడ్డి, గరికపాటి రమేష్‌బాబు, ఆనంద్, పి.ఎస్. కుమార్, దొరబాబు, చలపతి, ఎయిర్‌టెల్ మణి, మస్తాన్, వెంకటరాజు, ఓంప్రకాష్, మురళి, పులి సురేష్ తదితరులు 40మంది పాల్గొన్నారు.
No comments:
Post a Comment