వృత్తి నైపుణ్యంతోనే జర్నలిజానికి మనుగడ - స్వర్ణముఖి న్యూస్

 స్వర్ణముఖి న్యూస్

NEWS

Breaking

Home Top Ad

Post Top Ad

Wednesday, March 16, 2022

వృత్తి నైపుణ్యంతోనే జర్నలిజానికి మనుగడ

వృత్తి నైపుణ్యంతోనే జర్నలిజానికి మనుగడ : 'నేజు' రాష్ట్ర కమిటీ ప్రమాణ స్వీకారోత్సవంలో నేతలు

 తిరుపతి మార్చి 16 బుధవారం :
 జర్నలిజంలో నేడు చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో విలేకరులకు వృత్తి నైపుణ్యంలో శిక్షణ ఇవ్వడం ద్వారా జర్నలిజం మనుగడ సాగిస్తుందని యూనియన్ నేతలు తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. బుధవారం తిరుపతి యూత్ హాస్టల్ సమావేశపు హాలులో నవ్యాంధ్ర ఎడిటర్స్ అండ్ జర్నలిస్ట్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ ప్రమాణస్వీకారోత్సవం రాష్ట్ర అధ్యక్షులు సి. సూరిబాబు అధ్యక్షతన ఘనంగా జరిగింది. రాష్ట్ర కమిటీ సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు సూరిబాబు మాట్లాడుతూ ఇటీవల కాలంలో ప్రభుత్వాలు తీసుకుంటున్న వింత పోకడలతో పత్రికా రంగంలో చోటుచేసుకున్న పలు పరిణామాలు ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కొంటుందని ఆందోళన వ్యక్తం చేశారు .ముఖ్యంగా సోషల్ మీడియా రాకతో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలలో పనిచేసే వర్కింగ్ జర్నలిస్టులు ఏది సత్యమో ఏది అసత్యమో తెలుసుకోలేని పరిస్థితులు నెలకొన్నాయన్నారు. జర్నలిజం ఔన్నత్యాన్ని పెంచటానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు . రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్. మస్తాన్ వలి మాట్లాడుతూ గతంలో జర్నలిస్టులకు వృత్తిపరమైన అంశాలలో తర్ఫీదు ఇచ్చేందుకు ప్రెస్ అకాడమీ ప్రత్యేక తరగతులు నిర్ణయించేదన్నారు.తద్వారా జర్నలిజంలో పనిచేసే వర్కింగ్ జర్నలిస్టులు తమ వృత్తి నైపుణ్యాన్ని మెరుగు పర్చుకోవడం ద్వారా వాస్తవాలను ప్రజలకు, ప్రభుత్వానికి తెలియజేసే విషయంలో ముందుండే వారన్నారు . ప్రెస్ అకాడమీ ఇచ్చే శిక్షణ తరగతులు ఎంతో దోహదపడతాయి అన్నారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు నన్నూరు శ్రీనివాసరావు మాట్లాడుతూ సోషల్ మీడియా రాకతో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పెరుగుతున్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సమస్యలను దృష్టిలో పెట్టుకొని ప్రెస్ అకాడమీ వృత్తి నైపుణ్యం పై శిక్షణ తరగతులు నిర్వహించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. రాష్ట్ర కోశాధికారి షేక్.మహబుబ్ సుభాని మాట్లాడుతూ నవ్యాంధ్ర ఎడిటర్స్ అండ్ జర్నలిస్ట్స్ యూనియన్, సమాజాన్ని దృష్టిలో పెట్టుకుని జర్నలిజం, సామాజిక బాధ్యతతో కూడిన నైపుణ్యత తరగతులు నిర్వహిస్తామని పేర్కొన్నారు. తద్వారా ప్రజలకు ప్రభుత్వానికి జవాబుదారీతనంతో కూడిన సామాజిక బాధ్యతతో పని చేస్తామని అన్నారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు షేక్. అన్వర్ భాష మాట్లాడుతూ రాష్ట్రంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న పలు సమస్యల పరిష్కారానికి ముందుండి రాజీలేని పోరాటం చేస్తామని ఆయన అన్నారు .ఈ కార్యక్రమంలో నవ్యాంధ్ర ఎడిటర్స్ అండ్ జర్నలిస్ట్స్ యూనియన్ రాష్ట్ర జాయింట్ సెక్రెటరీలు బి. లోకనాథం, సలీం బాషా, సి. నాగార్జున , షేక్. అన్వర్ హుస్సేన్, ఏ .చిన్నకాశయ్య , రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ జి. సుకుమార్, చంద్రరాజు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యు. జమాలుల్లా , యం కరీంబేగ్, పి. దేవేందర్ యాదవ్, ఏ మన్సూర్ బాషా, దేసు గురు వెంకట ప్రతాప్, జి. శ్రీనివాసరావు ,పీ మస్తాన్ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad