మార్చ్ 14 న జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గుంటూరు జిల్లా లోని ఇప్పటం గ్రామం లో బారీ బహిరంగ సభ ఏర్పాటు చెయ్యడం జరిగింది. సభకు సంభందించిన చలో అమరావతి అనే పోస్టర్ ను శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన ఇంఛార్జి శ్రీమతి వినుత కోటా గారు పట్టణం లోని తన నివాస గృహం వద్ద మీడియా సమక్షంలో విడుదల చెయ్యడం జరిగింది. ఈ సందర్భంగా రేపు అనగా మార్చ్ 14 న శ్రీకాళహస్తి నియోజకవర్గం లోని నాయకులు, జనసైనికుల తో కలిసి భారీగా తరలి వెళ్లనున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రజలు జనసేన సభ కి ముందు, సభ తర్వాత అనేలా ప్రతిష్టాత్మకంగా ఉండనుందని తెలిపారు. రాష్ట్ర భవిషయత్తును దిశ, దశ మారిపోయేలా పవన్ కళ్యాణ్ గారి ప్రసంగం ఉంటుందని తెలిపారు.
ఈ కార్యక్రమం లో శ్రీకాళహస్తి మండల అధ్యక్షులు రాఘవయ్య గారు, శ్రీకాళహస్తి పట్టణ అధ్యక్షులు భవాని శంకర్, ఏర్పేడు మండల అధ్యక్షులు కిరణ్ కుమార్, నాయకులు మణికంఠ, మున్న,ప్రమోద్,నగేష్,సురేష్,సలీం, శీను, చందు చౌదరి,చందు, తదితరులు పాల్గొన్నార
No comments:
Post a Comment