జర్నలిస్టుల సమస్యలపై కలిసికట్టుగా పోరాటం : - స్వర్ణముఖి న్యూస్

 స్వర్ణముఖి న్యూస్

NEWS

Breaking

Home Top Ad

Post Top Ad

Friday, March 4, 2022

జర్నలిస్టుల సమస్యలపై కలిసికట్టుగా పోరాటం :

 జర్నలిస్టుల సమస్యలపై కలిసికట్టుగా పోరాటం :





 * అర్హులైన వర్కింగ్  జర్నలిస్టులందరికీ అక్రెడిటేషన్ లు

 

ఇళ్ల స్థలాలు, ఇల్లు నిర్మించి ఇవ్వాలి.


 * స్థానిక వార, పక్ష, మాస పత్రికలకు ప్రభుత్వ ప్రకటన  లు ఇవ్వాలి.


 * జీఎస్టీ రద్దు చేయాలి


* బేషరతుగా అక్రిడిటేషన్లు రెన్యువల్ చేయాలి.


       'నేజు'  రాష్ట్ర తొలి కార్యవర్గ సమావేశంలో తీర్మానం.


 రాష్ట్రంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలపై కలిసికట్టుగా పోరాటం చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని నవ్యాంధ్ర  ఎడిటర్స్ అండ్ జర్నలిస్టుల యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు సి. సూరిబాబు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  షేక్ మస్తాన్ వలీ పేర్కొన్నారు. గురువారం కడప ప్రెస్  క్లబ్ లో యూనియన్ రాష్ట్ర తొలి కార్యవర్గ సమావేశం జరిగింది.ఈ సమావేశంలో  25 తీర్మానాలు ఆమోదించారు. జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలపై సుదీర్ఘంగా  చర్చించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సి.సూరిబాబు,   షేక్ మస్తాన్ వలీ  మాట్లాడుతూ రాష్ట్రంలో జర్నలిస్టులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని వాటి పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రభుత్వం జర్నలిస్టులపై చిన్నచూపు చూస్తోందన్నారు.  జర్నలిస్టుల సంక్షేమం కోసం పాటు పడాల్సిన ప్రజా ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం శోచనీయమన్నారు. ఇప్పటికైనా సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్,  సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని నాని  జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. వర్కింగ్ జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్లు, ఇళ్ల స్థలాలు, గృహ నిర్మాణాలు చేపట్టాలన్నారు.  వయస్సుతో సంబంధం లేకుండా 20 సంవత్సరాలు అనుభవం ఉన్న వర్కింగ్ జర్నలిస్టులందరికీ నెలకు పది వేల రూపాయలు పింఛన్ ఇవ్వాలన్నారు.  కోవిడ్ తో మరణించిన జర్నలిస్టులకు రు. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలన్నారు. రు. 20 లక్షలు ప్రమాద భీమా, సహజ మరణం చెందితే 10 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని అన్నారు. స్థానిక దిన, వార, పక్ష, మాస పత్రికలకు జీఎస్టీ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. స్థానిక దిన,  వార,  పక్ష, మాస మాసపత్రిక లకు నెలకు 30 వేల రూపాయలు చొప్పున ప్రభుత్వ ప్రకటనలు సమాచార శాఖ ద్వారా ఇవ్వాలన్నారు. వర్కింగ్ జర్నలిస్టుల పిల్లలందరికీ ఉన్నత విద్య  మరియు ప్రొఫెషనల్ కోర్సులు  అభ్యసించడానికి ఆర్థిక సాయం అందజేయాలన్నారు. వర్కింగ్ జర్నలిస్టుల పిల్లలందరికీ ఇంటర్ వరకు ప్రైవేటు, కార్పొరేట్ విద్యా సంస్థలలో 50శాతం ఫీజు రాయితీ ఇచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఒకే జీవోను విడుదల చేయాలని అన్నారు.వర్కింగ్ జర్నలిస్టులందరికీ  నగదు పురస్కారాలు అవార్డులు  ప్రధానం చేయాలన్నారు.పలు దఫాలుగా మంజూరు చేసిన   అక్రిడిటేషన్లను బేషరతుగా డిసెంబర్ 31 వరకు రెన్యువల్ చేయాలన్నారు. జర్నలిజంలో 15 సంవత్సరాలు అనుభవం ఉన్న జర్నలిస్టులకు ఎలాంటి  నిబంధనలు లేకుండా అక్రెడిటేషన్ లు ఇవ్వాలన్నారు. జర్నలిస్టుల కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్రింటింగ్ ప్రెస్ ఏర్పాటు చేయడానికి సబ్సిడీ రుణాలు, సబ్సిడీపై న్యూస్ ప్రింట్ ఇవ్వాలన్నారు.  జర్నలిస్టుల పై దాడులకు పాల్పడిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి శిక్షించాలని  అన్నారు. గుర్తింపు పొందిన జర్నలిస్టుల సంఘాలకు అక్రిడిటేషన్ కమిటీలలో సభ్యత్వం కల్పించాలని డిమాండ్ చేశారు.

        ఆహ్లాదకరమైన వాతావరణంలో రాష్ట్ర తొలి కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న నాయకులు జర్నలిస్టుల సమస్యలపై సుదీర్ఘంగా చర్చించి  భవిష్యత్ కార్యాచరణ రూపొందించి, జర్నలిస్టుల సమస్యలపై రాజీలేని పోరాటాలు చేయాలని   పిలుపునిచ్చారు. 

ఈ సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు షేక్ అన్వర్ భాష, ఎం శ్రీనివాసరావు,  రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ బి.లోకనాథం, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ ఏం చంద్ర రాజు, కోశాధికారి ఎస్ కె.మహబూబ్ సుభాని,  రాష్ట్ర కమిటీ సభ్యులు జమాలుల్లా, రాజేంద్ర కుమార్, మొగల్ కర్రీo బేగ్ పాల్గొన్నారు.

ఈ సమావేశంలో ప్రత్యేక ఆహ్వానితులుగా సీనియర్ పాత్రికేయులు బుస్సా వెంకట సుబ్బయ్య  

సి నాగార్జున, ఆంధ్రప్రదేశ్ పత్రికా సంపాదకుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు  కోలా లక్ష్మీపతి,  జి సుకుమార్, ఎల్. చంద్రమోహన్ లు పాల్గొన్నారు.

యూనియన్ రాష్ట్ర తొలి కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న నాయకులను  ప్రముఖ సంఘ సేవకులు, కబడ్డీ అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షులు,  రాష్ట్ర బీసీ నాయకులు గోవింద నాగరాజు  ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  జర్నలిస్టుల సంక్షేమానికి  తన వంతు  సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని అన్నారు.జర్నలిస్టులను సత్కరించుకోవడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. వైద్య రంగంలో ఎనలేని సేవలు అందిస్తున్న  రిమ్స్ డాక్టర్ ఆనంద్ కుమార్,  గోవిందు నాగరాజును యూనియన్ పక్షాన   ఘనంగా సత్కరించారు. యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు షేక్. అన్వర్ బాష వందన సమర్పణతో ఈ కార్యక్రమం ముగిసింది.

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad