'నేజు' సభ్యునికి ఆర్ధిక చేయూత - స్వర్ణముఖి న్యూస్

 స్వర్ణముఖి న్యూస్

NEWS

Breaking

Home Top Ad

Post Top Ad

Wednesday, March 16, 2022

'నేజు' సభ్యునికి ఆర్ధిక చేయూత

'నేజు' సభ్యునికి  ఆర్ధిక చేయూత
ప్రభాతదర్శిని, ప్రత్యేక-ప్రతినిధి: అనారోగ్యంతో బాధపడుతున్న రేణిగుంట మండలానికి చెందిన సీనియర్ జర్నలిస్టు  నవ్యాంధ్ర ఎడిటర్స్ అండ్ జర్నలిస్ట్స్ యూనియన్ సభ్యుడు జగదీష్ కు ఆ యునియన్ నాయకులు ఆర్ధిక చేయుతను అందించారు.
తిరుపతి యూత్ హాస్టల్ లో బుధవారం జరిగిన నేజు రాష్ట్ర కమిటీ ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో జగదీష్ ను ఘనంగా సన్మానించారు. అనంతరం  రూ:10 వేల రూపాయల నగదు ను సహాయంగా అందించారు. గత కొంతకాలంగా జగదీష్
అనారోగ్యంతో బాధపడుతున్న ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయం గురించి తెలుసుకుని  నవ్యాంధ్ర ఎడిటర్స్ అండ్ జర్నలిస్ట్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ సహాయం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ నాయకులు సూరిబాబు, మస్తాన్ వలి, నన్నూరు శ్రీనివాసరావు, అన్వర్ భాష, యస్.మహబూబ్ శుభాని, లోకనాధo,నాగార్జున, చంద్రరాజు,సుకుమార్ కరీం బేగ్ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad