భావితరానికి మంచి నీళ్లు పరిశుభ్రమైన నీళ్లు గా అందించాలని , ప్రపంచ నీరు దినోత్సవం సందర్భంగా తెలిపిన న్యాయవాదులు , పారా లీగల్ వాలంటరీలు
స్వర్ణముఖి న్యూస్ ,శ్రీకాళహస్తి
న్యాయ వారోత్సవాల్లో భాగంగా జిల్లా కోర్టు వారి ఆదేశాల మేరకు ఈరోజు ప్రపంచ నీరు దినోత్సవం శ్రీకాళహస్తి పట్టణంలోని ఇరిగేషన్ శాఖ కార్యాలయంలో నీటి నిల్వ మరియు పరిశుభ్రత పై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసారు. ఈ ఇరిగేషన్ శాఖ అధికారులు మరియు సిబ్బంది , న్యాయవాదులు, లీగల్ ఎయిడ్ కోర్టు సిబ్బంది , పారా లీగల్ వాలంటరీ లు పాల్గొన్నారు,
న్యాయవాదులు మాట్లాడుతూ... రాబోయే కాలంలో నీటి నిల్వలు తక్కువ అవడంతో ప్రతి ఒక్కరు నీటి నిల్వల కొరకు సహకరించాలని, అలాగే పరిశుభ్రమైన నీరు భావితరానికి అందించడానికి తోడ్పడాలని కోరారు. అలాగే చట్టాల్లో నీటి నిల్వలపై న్యాయపరమైన సలహాలు, సూచనలు అందించారు. ముఖ్యంగా వాతావరణం చల్లగా ఉండాలంటే భూమి ఉపరితలంలో నీటి నిల్వలు ఎక్కువగా ఉండాలని, దీనికి ప్రతి ఒక్కరు ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాలని కోరారు
అలాగే మీ ప్రాంతం, ఊరి లో ఏ సమస్య వున్నా మాకు తెలపండి అన్నారు. అలాగే న్యాయ సలహాలకు 15100 ఫోన్ నెంబర్ గాని తెలియజేయవలసిందిగా కోరారు.
No comments:
Post a Comment