ఎస్ ఎస్ ఆర్ దాతృత్వం అనారోగ్యంతో బాధ పడుతున్న విద్యార్థినికి వైద్య ఖర్చుల నిమిత్తం రూ. 20,000 నగదు అందజేత
స్వర్ణముఖి న్యూస్ ,శ్రీకాళహస్తి .
శ్రీకాళహస్తి.. పట్టణానికి చెందిన చిత్తూరు జిల్లా టెన్నిస్ బాల్ క్రికెట్ అధ్యక్షులు యువ నాయకులు సామాను శ్రీధర్ రెడ్డి (ఎస్ ఎస్ ఆర్) మరోసారి తన సేవా గుణాన్ని మానవత్వాన్ని దాతృత్వాన్ని చాటుకున్నారు. వివరాల్లోకి వెళితే శ్రీకాళహస్తి పట్టణం పానగల్ ప్రాంతానికి చెందిన భాస్కర్ బేల్దారి మేస్త్రి రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబం భాస్కర్ కుమార్తె ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న అభిరామి గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ పలు హాస్పిటల్స్ వైద్యం చేయించుకుంటున్నారు. వైద్య ఖర్చులు భరించలేక తండ్రి భాస్కర్ సామాను శ్రీధర్ రెడ్డిని సోమవారం కలవగా విషయం తెలుసుకుని తీవ్ర ఆవేదనకు గురైన శ్రీధర్ రెడ్డి వెంటనే 20 వేల రూపాయలు నగదును కుటుంబ సభ్యులకు అందజేసి మెరుగైన వైద్యం అందించాలని అవసరమైతే మరోసారి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని ధైర్యంగా ఉండాలని కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు. తన కుమార్తె అనారోగ్యంతో బాధపడుతూ వైద్య ఖర్చులకు విషయం తెలుసుకున్న వెంటనే మంచి మనసుతో 20 వేల రూపాయలు నగదు అందించిన సామాను శ్రీధర్ రెడ్డి కి భాస్కర్ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేశారు.
No comments:
Post a Comment