ప్రగతిట్రస్ట్ మరియు సన్ నెట్వర్క్ ఆధ్వర్యంలో శ్రీకాళహస్తి ప్రభుత్వ ఆసుపత్రికి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి చేతులమీదగా
వైద్యపరికరాలను అందజేసిన ప్రగతి ట్రస్ట్ మరియు సన్ నెట్వర్క్ వ్యవస్థాపకులు.
శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ప్రగతి ట్రస్ట్ వ్యవస్థాపకులను మరియు కరోణ సమయంలో ఉత్తమసేవలు అందించిన డాక్టర్లకు,నర్సులను శాలువాలతో ఘనంగా సత్కరించి వారి సేవలను కొనియాడారు.
శ్రీకాళహస్తి ప్రభుత్వ ఆసుపత్రినీ శ్రీకాళహస్తి దేవస్థానంతో అనుసంధానం చేసే విధంగా, ముఖ్యమంత్రి వర్యులు దృష్టికి తీసుకునివెళ్లి కార్యాచరణ చేపడతానని బియ్యపు మధుసూదన్ రెడ్డి తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి దేవస్థానం పాలకమండలి చైర్మన్ అంజూరు శ్రీనివాసులు మరియు బోర్డు సభ్యులు,ప్రభుత్వాసుపత్రి వైద్యులు, నర్సులు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment