ఆడబిడ్డలను కాపాడండి తల్లితండ్రులకు భరోసా కల్పించండి :చక్రాల ఉష - స్వర్ణముఖి న్యూస్

 స్వర్ణముఖి న్యూస్

NEWS

Breaking

Home Top Ad

Post Top Ad

Friday, March 25, 2022

ఆడబిడ్డలను కాపాడండి తల్లితండ్రులకు భరోసా కల్పించండి :చక్రాల ఉష

 ఆడబిడ్డలను కాపాడండి SP స్పందన కార్యక్రమం లో  తిరుపతి పార్లమెంట్ తెలుగుమహిళా అధ్యక్షులురాలు శ్రీమతి చక్రాల ఉష వినతి పత్రం సమర్పించి ఈమధ్య కాలంలో ఆడబిడ్డల మీద జరిగిన దాడులను వివరించి భాదితులకు న్యాయం చేయమని కోరారు 



స్వర్ణముఖి న్యూస్, శ్రీకాళహస్తి :

చక్రాల ఉష మాట్లాడుతూ 

ఆడపిల్లల మీద మహిళల మీద దాడులు,లైంగికవేధింపులు, అకృత్యాలు, అత్యాచారాలు, హత్యలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి,ఆఖరికి పసిబిడ్డల జీవితాలు కూడా కామాoధులుచిదిమేస్తూ ఉన్నారు,, మీరేమో దిశా యాప్ అంటున్నారు దిశా పోలీస్ స్టేషన్లు అంటున్నారు దిశా చట్టం 21రోజుల్లో న్యాయం అంటున్నారే ఇప్పటి వరకూ ఒక్కరి కన్నా న్యాయం జరిగిందా??? ఆడబిడ్డలను కన్న తల్లితండ్రులు ఆ పిల్లలని బయటికి పంపాలంటే భయపడుతూ ఉన్నారు, ఇంక నన్నా భద్రత భరోసా కల్పించండి అని మొరపెట్టుకున్నారు 

            పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తిలో స్పందన కార్యక్రమం కి మీరు శ్రీకారం చుడుతుండటం హర్షించ దగ్గ విషయం.  కార్యకమాన్ని తెలుగుదేశం పార్టీ తరపున మేము స్వాగతిస్తున్నాం. అయితే మాకు కొన్ని సందేహాలు ఉన్నాయి. తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు, నియోజక వర్గాల పరిధిలో ఇటీవల కాలంలో మహిళపై అత్యాచారాలు, లైంగిక వేధింపులు జరుగుతున్నప్పటికీ... బాధితులకు తగు న్యాయం చేయడంలో పోలీసులు విఫలమవుతున్నారు. చట్ట పరిధిలో బాధితులకు న్యాయం జరగడం లేదు. శ్రీకాళహస్తి 1వ పట్టణ పోలీస్ స్టేషన్ లో పని చేసే ఓ కానిస్టేబుల్... ఇదే పట్టణంలో దక్షిణ కైలాసనగర్ లో నివాసం ఉంటూ వాలంటీరుగా పని చేసే ఉమామహేశ్వరి అనే  యువతిని ప్రేమ పేరుతో వంచించాడు. తనను పెళ్లి చేసుకోవాలని ఆ యువతి కోరినందుకు పంచాయతీ పేరుతో పిలిపించి ఆమె తండ్రిని చితకబాదాడు. యువతినీ కొట్టాడు. మీకు దిక్కున్న చోట చెప్పకోండి అంటూ బెదిరించాడు. ఈ అవమానం భరించలేక ఉమామహేశ్వరి నాలుగు నెలల కిందట ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె ప్రాణాలు పోయినా ఆ యువతి కుటుంబానికి ఇంతవరకు న్యాయం జరగలేదు. 


               శ్రీకాళహస్తి పట్టణం హౌసింగ్ బోర్డు కాలనీలో మూడు నెలల కిందట రెండవ తరగతి బాలికపై అదే ప్రాంతానికి చెందిన 40 ఏళ్ల వ్యక్తి అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. రాజకీయ ఒత్తిళ్లతో ఈ కేసును తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నించారు. ఈ ఘటనపై పత్రికల్లో రావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే బాలిక కుటుంబ సభ్యులకు న్యాయం జరగలేదు. 


                  శ్రీకాళహస్తి పట్టణం నడిబొడ్డున ఓ ప్రాంతానికి చెందిన యువకుడు బాబా ముసుగులో యువతులను వంచించాడు. ఇప్పటికీ అతడు అదే తరహాలో వ్యవహరిస్తున్నాడు. బాబా మోసాలపై ఏడాది కిందట ఓ కుటుంబం వారు శ్రీకాళహస్తి 1వ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ సమయంలో ఇక్కడ పని చేస్తున్న ఓ పోలీసు అధికారి బాధితుల పక్షాన నిలబడకుండా... బాబా వైపు నిలబడ్డారు. ఇది  కూడా రాజకీయ కారణాలో ఇలా చేశారు. పోలీసులు నిందితుని వైపు నిలబడటంతో బాధితులు చేసేది లేక మిన్నకుండి పోయారు. 


            తొట్టంబేడు మండలం కాసరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఒక వైద్యుడు వారం రోజుల కిందట అక్కడే సూపర్ వైజరుగా పని చేసే ఓ మహిళా ఉద్యోగిని రాయలేని విధంగా దూషించడంతో పాటు... వేధింపులకు గురి చేశాడు. బాధితురాలు యూనియన్ నేతల సహాయంతో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. అయితే అతనిపై ఇంతవరకు ఎలాంటి చర్యలూ తీసుకోలేదు.


                     రేణిగుంట మండలం ఇందిరానగర్ పరిధిలో ఆరేళ్ల బాలికపై అదే ప్రాంతానికి చెందిన మునిరాజా అనే వ్యక్తి వారం రోజుల కిందట లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. బాలిక కేకలు వేయడంతో ఇతరులు వచ్చి రక్షించారు. నిందితునికి అధికార పార్టీ అండ ఉంది. ఈ అవమానం భరించలేక బాలిక కుటుంబం బంధువుల ఇళ్లకు వెళ్లి పోయింది. 

                  నెల్లూరు జిల్లా వెంకటగిరి పట్టణంలో నాలుగు రోజుల కిందట జ్యోతి అనే ఇంటర్మీడియట్ విద్యార్థిని అదే పట్టణానికి చెందిన చెంచుకృష్ణ అనే యువకుడు ప్రేమ పేరుతో వేధించి... ఆ బాలిక నిరాకరించడంతో గొంతు కోశాడు. ప్రస్తుతం ఆ బాలిక తిరుపతి రుయా ఆస్పత్రిలో కోలుకుంటోంది


ఈమధ్య గూడూరు లో మరో అమ్మాయి ని పట్టపగలే కొంతుకోసి హత్యాచేశారు 


           ఇవి ఇటీవల కాలంలో జరిగిన కొన్ని ఉదాహరణలు మాత్రమే మీదృష్టికి తెస్తున్నాను. ఇలాంటి ఘటనలు నిత్యం జరగుతూనే ఉన్నాయి. మహిళపై అత్యాచారాలు, వేధింపులు జరగకుండా పోలీసులు చట్టబద్దంగా చర్యలు తీసుకోవాల్సి ఉంది. దిశ చట్టం కూడా కఠినంగా అమలు చేయాలి. పైన నేను పేర్కొన్న అన్ని ఘటనలపై విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని తెలుగుదేశం పార్టీ తరపున విజ్ఞప్తి చేస్తున్నాను. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరుకున్నారు.

ఈ ప్రభుత్వం లో షీ టీం కి వాహనాలు కూడా లేకపోవడం విడ్డురంగా ఉందని ప్రభుత్వ కాలేజీ లో ఊరికి దూరంలో ఉండడం ఆడపిల్లల భద్రతకు ఆటకం గా ఉండబట్టి షీ టీం వారికి వాహనాలు ఇప్పించాలని కోరుకున్నారు

 ఈ కార్యక్రమంలో భాధిత కుటుంబాలు,పట్టణ మహిళ అధ్యక్షురాలు  సుమతి, దుర్గా,సుజాత,కుమారీ,సునీమా,కావ్య, నాగిని,త్రివేణి తదితరులు పాల్గొన్నారు

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad