జనసేన ఆవిర్భవ దినోత్సవ పోస్టర్ ఆవిష్కరణ
ఈరోజు శ్రీకాళహస్తి పట్టణంలో జనసేన చిత్తూరు జిల్లా అధ్యక్షులు పసుపులేటి హరి ప్రసాద్ గారి ఆదేశాలతో జనసైనికులు మార్చి 14 వతేదీన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా జరగబోయే సమావేశానికి నియోజకవర్గ ప్రజలను ఆహ్వానిస్తూ గోడపత్రికలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వక్తలు ప్రసంగిస్తూ జనసేనాని ఇప్పటి వరకు ప్రజలకు తనదైనశైలిలో సమస్యలను పరిష్కరిస్తూ పార్టీ ప్రతిష్టను దశదిశలా వ్యాపింప చేస్తూ ఎక్కడసమస్యవుంటే అక్కడ జనసేన ఉద్భవిస్తుంది అని ఋజువుచేస్తున్నారు. అలాంటి మహోజ్వల భవిష్యత్తు వున్న పార్టీ నిబలపరచి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని ప్రజల శ్రేయస్సు కోసం పాటుపడే ఏకైక వ్యక్తిగా నిలబెట్టు కోవాల్సిన అవసరం మన ఆంధ్రప్రదేశ్ ప్రజల ముఖ్య కర్తవ్యం గా భావించాలని కోరారు. రేపు పట్టణంలోని పెళ్ళి మండపము నుంచిసుమారు 10 వాహనాలలో మంగళగిరి లోని ఇప్పటం గ్రామంలో జరిగే సభకు హాజరు అవ్వడానికి ప్రతి ఒక్క జనసైనికుడు తరలిరావాలని కోరారు. ఈ కార్యక్రమంలో కొట్టే సాయి, జయప్రకాష్, విజయ్ కుమార్, మహేష్, బద్రి, వంశీ,లీల, షేర్ ఖాన్,లోకేష్ తదితరులు పాల్గొన్నారు
No comments:
Post a Comment