శ్రీకాళహస్తి స్థానికులకు అన్ని వేళల్లోనూ శ్రీకాళహస్తీశ్వరుని దర్శనం
శ్రీకాళహస్తి స్థానికులకు శ్రీకాళహస్తీశ్వరుని
దర్శనం అన్ని వేళల్లోనూ ఆధార్ కార్డ్ చూపించి వెళ్ళే విధంగా అనుమతి ఇవ్వనున్నట్లు శ్రీకాళహస్తి ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ అంజూరు శ్రీనివాసులు వెల్లడించారు. మహిళా గ్రూపులకు అన్ని విధాల సహకారం అందిస్తామన్నారు.
శ్రీకాళహస్తి లోనీ 25 వ వార్డు వరదరాజుల స్వామి మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో శ్రీకాళహస్తి ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ అంజూరు శ్రీనివాసులు ను సత్కరించారు. స్థానిక ఆర్ పి లు, మహిళా సంఘాల మహిళలు చైర్మన్ అంజూరు శ్రీనివాసులు ను పూలమాలతో ఘనంగా సత్కరించి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా అంజూరు శ్రీనివాసులు మాట్లాడుతూ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి సహకారంతో మహిళా గ్రూపులు ఆర్థిక స్వావలంబన సాధించేలా నిర్మాణాత్మక సహకారం అందించడానికి హామీ ఇచ్చారు. స్థానిక మహిళలు ప్రతిరోజు శివయ్య దర్శనానికి వెళ్లి వచ్చే ఆచారాన్ని కొనసాగిస్తూ ఏ సమయంలో అయినా స్వామి అమ్మవార్లను దర్శించుకునే విధంగా ఇబ్బంది లేకుండా ఆధార్ కార్డు తో నేరుగా దర్శనానికి అనుమతి ఇచ్చే విధానాన్ని త్వరలోనే స్థానికులకు అందుబాటులోకి తెస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ పి లు అనిత, శాంతి, లతా, ముంతాజ్, అనురాధ, భారతి, నాగమణి, లీలావతి, ఉమా తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment