గోశాల సంరక్షణ కేంద్రాన్ని పరిశీలించిన న్యాయవాదులు, పారా లీగల్ వాలంటరీ
గౌరవ శ్రీ కాళహస్తి సీనియర్ సివిల్ జడ్జి ఆదేశాల మేరకు ఈరోజు శ్రీకాళహస్తిశ్వర స్వామి దేవస్థానం అనుసంధానమైన గోశాలను పరిశీలించిన లీగల్ ఎయిడ్ కౌన్సిల్ మెంబెర్ మరియు పారా లీగల్ వాలంటరీ .
అనంతరం న్యాయవాది గోశాల ను పరిశీలించి వాటి బాబోగులను అక్కడున్న అధికారులను అడిగి తెలుసుకున్నారు. అలాగే గోశాల గోవుల గురించి గోవుల వైద్యులతో మాట్లాడి తెలుసుకొన్నారు.
న్యాయవాది మాట్లాడుతూ.... ఈ గోశాలలో సుమారు 700 పైచిలుకు ఆవులున్నాయి, అలాగే 40 అవులకు ఒక సంరక్షకుడు ఉన్నారని, విటిని సంరక్షించడానికి ఒకే ఒక వైద్యుడు ఉండడం వల్ల గోశాలోని ఆవులు రెండు మూడు రోజులకు ఒక ఆవు చనిపోతూవుండడం చాలా బాధాకరం అని కావున వైద్యులు పెంచి గో సంరక్షణ చేయాలని గౌరవ జడ్జిగారికి తెలుపుతామన్నారు
No comments:
Post a Comment