జన ఔషధీ దివస్ సందర్భంగా పేదవాళ్లకు కు, విద్యార్థులకు మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని వరదరాజ స్వామి గుడి ప్రాంగణంలో ఉన్న ప్రధానమంత్రి జన ఔషధీ కేంద్రం లో ఈ రోజు జన ఔషధీ దివాస్ సందర్భంగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. జన ఔషధి లో లభించే మందుల గురించి మరియు వాటి ఉపయోగం గురించి ప్రజలకు అవగాహన కల్పించారు.అలాగే డాక్టర్ ప్రమీలమ్మ గారి ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపు జరిగినది. ఈ కార్యక్రమంలో లో రాష్ట్ర బిజెపి మీడియా కార్యదర్శి కోలా ఆనంద్, రాష్ట్ర బిజెపి కార్యదర్శి కండ్రిగ ఉమా, తిరుపతి పార్లమెంటు జిల్లా ఉపాధ్యక్షుడు Dr. చంద్రప్ప ,
బీజేపీ నాయకులు చిలక రంగయ్య, ఉమా సింగ్, గరికిపాటి రమేష్, వజ్రం కిషోర్, వాసు యాదవ్, ఢిల్లీ బాబు, వెంకట సుబ్బయ్య మరియు జన ఔషధీ కేంద్రం నిర్వాహకులు సూర్య కుమార్, అరుణకుమారి.... మొదలైన వారు పాల్గొన్నారు.
అనంతరం పెదవారికి ఉచితంగా బీపీ, షుగరు చెక్ చేసి తగు సూచనలు, సలహాలు అందించారు . అలాగే పేద విద్యార్థులకు ప్రధానమంత్రి జన ఔషధీ శానిటరీ నాప్కిన్స్ అతిథిల అందించారు.
కోలా ఆనంద్ మాట్లాడుతూ.... కేంద్ర ప్రభుత్వం పేద వారి కోసం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ప్రధానమంత్రి జన ఔషధీ కేంద్రం ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. అలాగే 36 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల్లో 739 జిల్లాలోని 8675 జన్ ఔషధ కేంద్రాలు పని చేస్తోందన్నారు. ఈ మందులు WHO-GMP, NABL ధ్రువీకృత నాణ్యమైన ఔషధాలు. కావున ప్రతి ఒక్క పేదవాళ్ళు ,మధ్య తరగతి వాళ్లు ఉపయోగించుకోవాలని కోరారు.
Dr. చంద్రప్ప మాట్లాడుతూ.... 1451 రకాలైన అత్యుత్తమైన నాణ్యత గల ఔషధాలు మరియు 240 సర్జికల్ ఎక్యుప్మెంట్స్ ఈ కేంద్రంలో లభిస్తాయన్నారు. జన ఔషధాలు మందులు వాడడంతో గత ఏడు సంవత్సరాలు సాధారణ ప్రజలకు 13 వేల కోట్ల ఆదా చేశారు. కేంద్ర ప్రభుత్వం గుర్తింపు పొందిన ప్రధాన మంత్రి భారతీయ జన్ ఔషధ కేంద్రమునందు మధ్య తరగతి, పేదవారి బడ్జెట్ కు అనుగుణంగా అతి తక్కువ ధరకే మందులు అందిస్తున్నాము. ప్రతినెల ఎక్కువ ఖర్చు అయ్యే బీపీ , షుగర్, గుండె సంబంధిత, నరాలు,గ్యాస్...మొదలైన మందులు నాణ్యత కల్గిన తక్కువ ధరలకు లభ్యం.
కావున ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని తెలిపారు
No comments:
Post a Comment