ప్రేమోన్మాదులు పట్టపగలు నడిరోడ్లలో వదలడం లేదు ఇళ్లల్లో ఉన్న ఆడబిడ్డలను గొంతులు కోస్తుంటే
మహిళలకు భద్రత ఉందా????
నెల్లూరు జిల్లా వెంకటగిరిలో ప్రేమోన్మాది ఘాతుకం - ఇంటర్ విద్యార్థిని గొంతుకోసిన చెంచుకృష్ణ - విద్యార్థిని జ్యోతి పరిస్థితి విషమం, ఆస్పత్రికి తరలింపు - తనను ప్రేమించడంలేదని ఘాతుకానికి పాల్పడ్డ చెంచుకృష్ణ - చెంచుకృష్ణను అదుపులోకి తీసుకున్న పోలీసులు
తిరుపతి రూయ హాస్పిటల్ లో జ్యోతి కి చికిత్స అందిస్తున్నారు
విషయం తెలుసుకున్న తిరుపతి పార్లమెంట్ అధ్యక్షులు నరసింహాయాదవ్, తిరుపతి మాజీ శాసనసభ్యులు సుగుణమ్మ, తిరుపతి పార్లమెంట్ తెలుగుమహిళా అధ్యక్షురాలు చక్రాల ఉష నగర అధ్యక్షురాలు బ్యాంక్ శాంతమ్మ విషయం తెలుసుకొని హుటాహుటిన సంఘటనా స్థలికి చేరుకొని జ్యోతి ని పరామర్శించి డాక్టర్ లతో మాట్లాడి మంచి మెరుగైన వైద్యం అందించాలని కోరుకున్నారు
వారి కుటుంబ సభ్యులకు ధైర్యం కలిగించి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత, కురుగుంట్ల రామకృష్ణ ఫోన్ లో మాట్లాడుతూ హంతకుడికి శిక్ష పడేలా పోరాడతామని చెప్పారు
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగన్ పాలనలో ప్రతిరోజు ఇటువంటి ఘటనలు జరగడం నిత్య కృత్యం అయిందని ఆడబిడ్డల మానప్రాణాలకు భద్రత లేకపోవడం బాధాకరమని, ఈమధ్య వెంకటగిరి నియోజకవర్గం సైదాపురం లో విదేశీ యువతి మీద అత్యాచారయత్న ఘటన విదేశాల్లో కూడా చర్చనీయాంశం అవ్వడం సిగ్గుచేటని ,,మొన్న రేణిగుంట ఆరేళ్ల చిన్నారిపై లైంగిక వేధింపులు మరవకముందే ఈరోజు వెంకటగిరిలో జ్యోతి మీద ప్రేమోన్మాది చెంచు కృష్ణ ఇంత ఘోరానికి ఒడిగట్టాడు అంటే ఈ రాష్ట్రంలో శాంతిభద్రతలు ఏ విధంగా ఉన్నాయో ప్రతి ఒక్కరికి అర్థమతొందని ఆవేదన వ్యక్తం చేశారు అర్ధరాత్రి ఆడపిల్ల నడిరోడ్డులో నడిచేటప్పుడు స్వాతంత్రం వచ్చింది అన్నారే ఈ జగన్ రెడ్డి పాలనలో పట్టపగలే నడిరోడ్డు లో ఆడబిడ్డ లను గొంతు కొయ్యడాలు, కత్తులతో పొడవడాలు చూస్తుంటే ఈ సభ్య సమాజంలో ఉన్నామా సందేహం వస్తోంది రాక్షసుల మధ్య బతుకుతున్నా మా భయం కలుగుతోంది
ఇళ్లల్లో ఉంటే కూడా గొంతు కోసి పోతున్నారు మరి శాంతిభద్రతలు ఉన్నాయా వీళ్లకు శిక్షణ పడతాయా రోజమ్మ గారు సెలవిచ్చారే ఆడపిల్లకు అన్యాయం జరిగితే గన్ను కన్నా ముందు జగన్ను వస్తాడన్న అదే మరి ఉన్నాడా దాక్కున్నాడా గన్ను పాడైపోయిందా???????
దిశా చట్టం ఉందా
ఆడ బిడ్డలను కన్న తల్లిదండ్రులు ప్రశాంతంగా ఉండే స్థితి ఈ పాలనలో ఉందా?????
హంతకుడికి వెంటనే దిశా చట్టం కింద శిక్ష అమలు చేయాలని డిమాండ్ చేశారు
ఈ కార్యక్రమం లో బుల్లెట్ రమణ, సదా శివయ్య,శ్రీపతి బాబు,ఆర్ సి మునికృష్ణ య్య,ప్రదీప్, రుద్రకోటి,మనోహరచారీ,
కుమారమ్మ, అనిత,భారతి, హేమ, యశోద తదితరులు పాల్గొన్నారు
No comments:
Post a Comment