శ్రీ కాళహస్తీశ్వరఆలయంలో రాహు-కేతువు పూజకి సిద్ధం
శ్రీ కాళహస్తీశ్వరఆలయంలో రాహుకేతు పూజ నివారణ పూజ చేసుకోవడానికి ఆలయానికి పోటెత్తిన రావడంతో రాహు-కేతువు నివారణ పూజలకు నాగపడగల కొరత ఏర్పడడంతో కొద్దిపాటి అంతరాయం ఏర్పడింది..ఈ విషయం తెలుసుకున్న వెంటనే శ్రీకాళహస్తి దేవస్థానం పాలకమండలి చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు వెంటనే హుటాహుటిన రాహుకేతు పడగలు తయారుచేసే మింట్ ను పరిశీలించి.. విషయాన్నీ గౌరవనీయులైన శాసనసభ్యులు శ్రీ బియ్యపు మధుసూదన్ రెడ్డి గారికి తెలియజేసి అక్కడ సిబ్బందితో విచారించి రాహుకేతు పడగలు సిద్ధం చేసి భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సమస్యను సానుకూలంగా పరిష్కరించి అధికారులకు, సిబ్బందికి ఇటువంటి సమస్య భవిష్యత్తులో పునరావృతం కాకూడదని ఆదేశాలు జారీ చేశారు..
చైర్మన్ శ్రీ అంజూరు శ్రీనివాసులు మాట్లాడుతూ..
నేడు సోమవారం కావడంతో భక్తులు శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి రాహుకేతు పూజలు చేసుకోవడానికి అధిక సంఖ్యలో భక్తులు రావడంతో రాహువుకేతువు నివారణ పూజలలో నాగపడగలు లేక కొద్దిపాటి అంతరాయం ఏర్పడిందని , ఈ విషయం పై అధికారులతో చర్చించి ఇలాంటి ఇబ్బందులు భక్తులు మరోమారు రానివ్వకుండా చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. అంతేగాక ముఖ్యంగా శ్రీకాళహస్తి ఆలయంలో విచ్చేసిన భక్తులను కొంతమంది దళారీలు పూర్తిగా మోసం చేస్తున్నారని, భగవంతుని పేరు చెప్పుకొని వ్యాపారం చేస్తున్నారని అటువంటి దళారీ వ్యవస్థ నడుపుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటూ వారిపైన క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయబడతాయి అని, గతంలో ఇటువంటి దళారీ వ్యవస్థ ధార్మిక సంస్థ అయినటువంటి దేవాలయాన్ని వ్యాపార సంస్థ గా మార్చే చేస్తున్నారని అటువంటివన్నీ ఆపివేయాలని హెచ్చరించారు. బ్రతకడానికి చేసే వ్యాపారం కోసమే అయితే శ్రీయుత ఎమ్మెల్యే గారు ఇప్పటికే మూడు వందల మందికి తోపుడుబండ్లనీ ఇచ్చి అండగా నిలబడ్డారు అని, అవసరమైతే ఆటువంటి వ్యాపారం కోసం సహాయం కోసం నా దృష్టికి తీసుకొస్తే ఎమ్మెల్యే గారికి తెలియజేస్తానని ఎమ్మెల్యే గారు జీవనోపాధికి ఎల్లప్పుడు ముందుంటారని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో బోర్డు సభ్యులు.సాధన మున్నా రాయల్,ప్రకాశం పంతులు,జయశ్యామ్,పసల సుమతి,కేసరి సుబ్బారెడ్డి.మరియు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
No comments:
Post a Comment