ముక్కంటీశుని కార్తీక దీపపు మండపం ప్రారంభం
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
శ్రీకాళహస్తి ఆలయ ప్రాంగణంలో కార్తీక దీపాలు వెలిగించడానికి ప్రత్యేక మండపాన్ని దేవస్థానం చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు ప్రారంభించారు.
కార్తీక మాసంలో దీపాలు వెలిగించేందుకు పెద్ద ఎత్తున మహిళా భక్తులు రానున్న నేపథ్యంలో ఆలయ చైర్మన్ అంజూరు శ్రీనివాసులు ప్రత్యేక చొరవ చూపి మహిళలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా దీపాలు వెలిగించడానికి ప్రత్యేక మండపాలను ఏర్పాటు చేశారు. ఆలయ ప్రాంగణంలోని కాశి విశ్వనాధ్ ఆలయం పక్కన ప్రత్యేక మండపం, అలాగే నాలుగో గేటు వద్ద మణికంఠేశ్వర ఆలయం వద్ద ప్రత్యేక ఏర్పాటు చేయించారు. కార్తీక మాసం మొదటి సోమవారం కావడంతో ఈ ప్రత్యేక మండపం లో ఏర్పాటుచేసిన శివలింగం వద్ద ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహించి దేవస్థానం చైర్మన్ అంజూరు శ్రీనివాసులు, ఆలయ ఈవో సాగర్ బాబులు దీపపు పూజా కార్యక్రమాన్ని ప్రారంభింపజేశారు.
ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపాలు వద్ద మహిళలు పెద్ద ఎత్తున దీపాలు వెలిగించి, దీపు పూజ నిర్వహిస్తున్నారు. ఈ పూజాది కార్యక్రమంలో ఆలయ అధికారులు AEO కృష్ణారెడ్డి ధర్మకర్తల మండలి సభ్యులు కొండూరు సునీత, లక్ష్మీ ప్రత్యేక ఆహ్వానితుల పాలకమండలి సభ్యులు జూలకంటి సుబ్బారావు, చింతామణి పండు శ్రీదేవి మరియు లక్ష్మీపతి ఎంపి సిల్క్ వెంకటసుబ్బయ్య వేద పండితుల అర్ధగిరి, ఆంజనేయ శర్మ, పరిచారకులు గోవింద్ శర్మ, చందు భక్తులు పాల్గొన్నారు. పాల్గొన్నారు.
No comments:
Post a Comment