దళితులందరు మా కుటుంబ సభ్యులు : బొజ్జల బృందమ్మ
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
ఈరోజు శ్రీకాళహస్తి పార్టీ కార్యాలయం నందు నియోజకవర్గ దళిత ఆత్మీయ సమావేశం జరిగింది
ఈ కార్యక్రమంకి శ్రీకాళహస్తి నియోజకవర్గం మహిళల వేగుచుక్క ఇంచార్జి మాజీ మంత్రి బొజ్జల గోపాల కృష్ణ రెడ్డి సతీమణి అయిన బృందమ్మ ముఖ్యఅతిథిగా విచ్చేసరు
దేశం రాష్ట్రం నియోజవర్గం లలో 65 శాతము ఓటు బ్యాంకు ఉన్న మనం భయపడి బలహీనo గా ఉన్నా రోజులను, విడనాడి బలమైన శక్తిగా ఎదగాలని తెలుగుదేశం నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షులు చుక్కల రమేష్ నాయకత్వంలో సమావేశంజరిగింది
బృందమ్మ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎస్సి ల అణగదొక్కే ఎస్సీల పైనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు బనాయిస్తున్నారని ఆనాడు అధికారం కోసం పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి దళిత జాతి గొప్పదనం దళితులే దేవుళ్ళు అంటూ దండోరా వేసి అందలం ఎక్కికాక దళితుల గురించి మరిచిపోయన, ఘనుడు నీచుడు, నియంత, జగన్మోహన్ రెడ్డి అని ఆమె అన్నారు బొజ్జల గోపాలకృష్ణ రెడ్డి దళితుల అభివృద్ధి కోసం ఎంతగానో కృషి చేసారని గుర్తుచేశారు యోజకవర్గంలో దళితుల పై దాడులు పెరిగిపోయాయని రాబోయే ఎన్నికలలో రామరాజ్యం కోసం సుధీర్ బాబు ని గెలిపించాలని కోరారు
అంతే కాకుండా రాష్ట్రంలో ఉప్పు ఉల్లిగడ్డ ధరలు పెంచి పేదవాడు ను మరింత పేదవాడుగా చేసే కార్యక్రమాలు చేస్తున్నాడని ఆమె అన్నార
రాష్ట్ర కార్యదర్శి మల్లిశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రాబోయే రోజులలో సుధీర్ బాబు ని గెలిపిస్తే తిరుపతి జిల్లా నుంచి మంత్రి గా కూడా చూడచ్చన్నారు
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు మలిశెట్టి వెంకటేశ్వర్లు, దళిత నాయకులు రమేష్, రాష్ట్ర యసి సెల్ జనరల్ సెక్రటరీ గోపినాథ్,సంపత్, సన్నీ, భాస్కర్, మణి, సుబ్రహ్మణ్యం, రాజా, రామకృష్ణ,లక్ష్మణ్, ఊహ,జయశ్రీ మరియు దళిత కార్యకర్తలు పాల్గొన్నారు
No comments:
Post a Comment