ఘనంగా పెద్దాయన పెద్దిరెడ్డి జన్మదిన వేడుకలు
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
మంత్రి, జిల్లాకు పెద్ద దిక్కు అయిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన సందర్భంగా శ్రీకాళహస్తి పట్టణము లోని స్థానిక వైయస్సార్ సర్కిల్ వద్ద ఏర్పాటైయున్న ప్రజానేత వై. యస్.రాజశేఖర్ రెడ్డి విగ్రహము నందు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు మరియు సేవా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమమునకు శ్రీకాళహస్తి నియోజకవర్గ గారవ శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి ముఖ్య అతిథులుగా విచ్చేసి ముందుగా పార్టీ మహిళలచే వైయస్సార్ విగ్రహానికి పూలమాలలు ధరింపజేశారు. తదనంతరం భారీగా ఏర్పాటు చేసిన కేక్ ను పార్టీ నాయకులు, అభిమానుల శుభాకాంక్షల హర్షద్వానాల మధ్య కేక్ ను కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. అనంతరం పేద మహిళలందరికీ చీరలను పంపిణీ చేశారు. తదనంతరం ఎమ్మెల్యే చేతుల మీదుగా కార్యమానికి విచ్చేసిన నిరుపేదలందరికీ పెద్ద ఎత్తున స్టీల్ ప్లేట్లను అందజేశారు.
ఈ సందర్భంగా శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలోనే మనందరికీ పెద్ద దిక్కు అయిన సీనియర్ నాయకులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు శ్రీకాళహస్తి పట్టణంలోని వైయస్సార్ సర్కిల్ వద్ద ఆలయ చైర్మన్ అంజూరు శ్రీనివాసులు ఏర్పాటు చేసిన పలు సేవా కార్యక్రమలతో ఘనంగా నిర్వహించారని, అదేవిధంగా నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో కూడా పెద్ద ఎత్తున పెద్దాయన జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామని, పెద్దాయన పెద్దిరెడ్డి నియోజకవర్గ ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ, పేద ప్రజలందరికీ సహాయపడుతున్నారని, మన జిల్లాలోనే కాకుండా పక్క జిల్లాలైన కృష్ణా జిల్లా, ఉభయ గోదావరి జిల్లాలలో కూడా పెద్దాయన జన్మదిన వేడుకలు వైభవంగా నిర్వహిస్తున్నారంటే ఆయన మీద ఉన్న నమ్మకం, అభిమానాలేనని తెలియజేశారు. కావున ఈ సందర్భంగా వారికి వారి కుటుంబ సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ శ్రీకాళహస్తీశ్వరుని యొక్క చల్లని దీవెనలు ఎల్లవేళలా వారికి ఉంటాయని తెలియజేశారు. అదేవిధంగా మాజీ శాసన శాసనసభ్యులైన ఎస్.సి. వి.నాయుడు వేడుకలలో పాల్గొని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ మహిళా నాయకులు పసల సుమతి,సునీత సింగ్, మస్తానమ్మ, బిందు మరియు నాయకులు లోకేష్ యాదవ్, పగడాల రాజు,చంద్ర రాజు, చల్లా జయరామరావు, కలతూరు మునిరాజ, చాన్ భాష, సుబ్రహ్మణ్యం, పూల కృష్ణమూర్తి, ఉప్పు కృష్ణయ్య, నానీ, మున్నా రాయల్, జయశ్యామ్, చిరంజీవి మొగరాల గణేష్, కుమార్ స్వామి,సెన్నేరు కుప్పం శేఖర్ పాలమంగళం రవి, కంఠ ఉదయ్, మాతయ్య, శ్రీనివాసులు, పత్తి మణి, హరి నాయుడు, రామచంద్రారెడ్డి, లీలా, పెరుమాళ్, చింతామణి పాండు, వేడం బాల, శ్రీనివాసులు, సుబ్రహ్మణ్యం, చాంద్ బాషా, అశోక్, గయాజ్, షేక్ జిలానీ ,నరసింహా, బాల గౌడ్, ధన, కళ్యాణ్, తదితరులతో పాటు పార్టీ కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment