జాతిపిత మహాత్మా గాంధీజీ జయంతి. నివాళులు అర్పించిన అంజూరు శ్రీనివాసులు
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
*జాతిపిత మహాత్మా గాంధీజీ జయంతి. ఘనంగా నివాళులు అర్పించిన ఆలయ ఛైర్మన్ అంజూరు శ్రీనివాసులు*
మహాత్మా గాంధీజీ జయంతి సందర్భంగా శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్తల మండల అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు గారి ఆధ్వర్యంలో శ్రీకాళహస్తి పట్టణ తీరువీధిలో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా చైర్మన్ అంజూరు శ్రీనివాసులు మాట్లాడుతూ శ్రీకాళహస్తి పట్టణంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలను పట్టణ పౌరులు మరియు దేవస్థానం సెక్యూరిటీ సిబ్బందితో అందరితో కలిసి నివాళులర్పించడం జరిగిందని, ఈరోజు మనమందరం స్వతంత్రంగా స్వాతంత్ర ఫలాలు అనుభవిస్తున్నామంటే ఆ మహనీయుని యొక్క ప్రాణత్యాగం చేసి స్వాతంత్రం పొందడం వల్లనేనని, ఆ మహానుభావుని యొక్క జయంతి వేడుకల్లో పాల్గొనడం వారికి నివాళులర్పించడం మనందరిని బాధ్యత అని, వారి యొక్క ఆశయం ఆయుధం అహింస అని, అటువంటి అహింసా మార్గమునే మనమందరం పాటించాలని తెలియజేశారు.
No comments:
Post a Comment