బాల్య వివాహన నిర్మూలనకు ప్రతి ఒక్కరు తోడ్పడాలని కోరిన న్యాయవాదులు మరియు పారా లీగల్ వాలంటరీలు.
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
శ్రీకాళహస్తి సీనియర్ సివిల్ జడ్జ్ ఆదేశాల మేరకు ఈరోజు తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్నంలోని ప్రభుత్వ వెనుకబడిన తరగతుల బాలికల వసతి గృహము నందు విద్యార్థినులకు బాల్యవివాహాలపై మరియు బాల్య వివాహాల నిర్మూలన చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు రాజేశ్వరరావు, గరికపాటి రమేష్ మరియు పారా లీగల్ వాలంటరీలు పాల్గొన్నారు.
న్యాయవాదులు మాట్లాడుతూ... చదువుకున్న వయసులో చదివే తప్ప వేరే ఆలోచన బాలికలకు ఉండకూడదన్నారు. అలాగే బాల్య వివాహం చేసుకోవడం వల్ల సమాజానికి మరియు మన ఆరోగ్యానికి చాలా హాని చేస్తుందని వివరించారు. మరియు బాల్య వివాహాలు చేసుకున్న, ప్రోత్సహించిన వారికి చట్టంలో కఠినమైన శిక్షలు ఉంటాయని తెలిపారు.
ముఖ్యంగా మహిళలకు, చిన్న పిల్లలకు ఉచిత న్యాయం అందిస్తుందని. అలాగే మీకు ఏ సందేహాలు ఉన్న 15100 ను సంప్రదించాలని కోరుతూ కోరినారు
No comments:
Post a Comment