సంఘటనలు భవిష్యత్తు లో పునరావృతం కాకుండా తగుచర్యలు తీసుకోవాలి: కొట్టేసాయి. - స్వర్ణముఖి న్యూస్

 స్వర్ణముఖి న్యూస్

NEWS

Breaking

Home Top Ad

Post Top Ad

Thursday, October 20, 2022

సంఘటనలు భవిష్యత్తు లో పునరావృతం కాకుండా తగుచర్యలు తీసుకోవాలి: కొట్టేసాయి.

సంఘటనలు భవిష్యత్తు లో పునరావృతం కాకుండా తగుచర్యలు తీసుకోవాలి:   కొట్టేసాయి.








   స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :

శ్రీకాళహస్తిలో కాసాగార్డెన్ రేసిడెన్సియల్ స్కూల్ లో జరిగిన సంఘటన దురదృష్టకరం, ఇలాంటి సంఘటనలు భవిష్యత్తు లో పునరావృతం కాకుండా తగుచర్యలు తీసుకోవాలి: జనసేన పార్టీ చిత్తూరుజిల్లా కార్యదర్శి కొట్టేసాయి.

#దాడిలో గాయపడిన బాలిక పరామర్శ.

#పాఠశాలను పరిశీలించి, విద్యార్థుల సమస్యలపై పాఠశాల అధికారులతో చర్చించారు.

నిన్నటిదినం కాసాగార్డెన్ రేసిడెన్సియల్ పాఠశాలలో ఐదవ తరగతి చదువుతున్న విద్యార్ధిని పై పాఠశాల ఆవరణలో కోతి దాడి చేసి తీవ్రంగా గాయపడిన బాలికను ఈ రోజు జనసేన పార్టీ నాయకులు పరామర్శించారు..అలాగే పాఠశాలను పరిశీలించి ప్రిన్సిపాల్ గారితో ఈ సమస్యపై చర్చించారు.భవిష్యత్తు లో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని వారికి తెలియజేయడం జరిగింది.

ఈ సంధర్బంగా జనసేనపార్టీ జిల్లా కార్యదర్శి కొట్టే సాయి మాట్లాడుతూ... పాఠశాల ఆవరణలో ఇలాంటి సంఘటనలు,ఇంతకు ముందుకుడా జరిగాయని విద్యార్థులతో మాట్లాడితే చెపుతున్నారు అని,మెస్ లో  పెట్టె భోజనం బాగాలేదు అని వాపోయారు. ఈ సమస్యలపై ప్రిన్సిపాల్ గారితో చర్చించామని,భవిష్యత్ లో ఇలాంటివి జరగకుండా చూస్తామని మాట ఇచ్చారు అని తెలియచేసారు...ఈ కార్యక్రమంలో జనసేనపార్టీ నాయకులు కుమార్,మహేష్,వంశీ,చిరంజీవి, లోకేష్ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad