ముక్కంటీశుని దర్శించుకున్న రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
ప్రముఖ శైవ క్షేత్రాలలో ప్రసిద్ధిగాంచిన శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత వాయులింగేశ్వరుడు కొలువు తీరివున్న శ్రీకాళహస్తి పుణ్య క్షేత్రమునకు రాజ్యసభ సభ్యులు అయిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కుటుంబ సమేతంగా దర్శనానికి విచ్చేశారు.
వారికి శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు ఘనంగా స్వాగతం పలికారు. దక్షిణ గాలిగోపురం వద్ద వారికి ఆలయ పండితులచే వేదమంత్రాలతో, పుష్ప మాలలు అలంకరించి స్వాగతంపలికారు. తదనంతరం ఛైర్మన్ అంజూరు శ్రీనివాసులు వారికి స్వామి-అమ్మవార్ల ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసి, దర్శనానంతరం ఆలయం లోని దక్షిణామూర్తి స్వామి వారి సన్నిధానం వద్ద వారికి స్వామి అమ్మవార్ల శేష వస్త్రాలతో సత్కరించి, స్వామి-అమ్మ వార్ల చిత్రపటాన్ని మరియు తీర్థ ప్రసాదాలను అందజేశారు. స్థానిక శాసనసభ్యులు కుమార్తె పవిత్రా రెడ్డి వారిని కండువాతో సత్కరించి, లక్ష్మీదేవి అమ్మవారి ప్రతిమను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారి మల్లిఖార్జున ప్రసాద్, సుదర్శన్, పాలకమండలిసభ్యులు మహీధర్ రెడ్డి, పసల సుమతి మరియు నందా మెడికల్స్ నరసింహులు, పాలమంగళం రవి, బాల గౌడ్, సుధీర్, సునీల్, తేజ, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment