మానసిక వికలాంగులకు చట్టాలపై అవగాహన కల్పించిన న్యాయవాదులు మరియు పారా లీగల్ వాలంటరీ
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా మానసిక వికలాంగులకు చట్టాలపై అవగాహన కల్పించిన న్యాయవాదులు మరియు పారా లీగల్ వాలంటరీ
తిరుపతి జిల్లా తొట్టంబేడు మండలంలోని బసవయ్య పాలెం గ్రామంలో ప్రత్యేక అవసరాలు గల శిక్షణ కేంద్రంలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు రాజేశ్వరరావు, గరికపాటి రమేష్ , అరుణ్ మరియు పార లిగల్ వాలంటరీలు, కోర్ట్ సిబ్బంది పాల్గొన్నారు.
న్యాయవాదులు మాట్లాడుతూ..... గౌరవ శ్రీకాళహస్తి సీనియర్ సివిల్ జడ్జి గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ కేంద్రమును పరిశీలించడం జరిగింది. అలాగే విద్యార్థులకు అందవలసిన వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులకు వారి ఉపాధ్యాయులకు చట్టాలపై అవగాహన కల్పించారు. అలాగే మీకు ఏ సమస్య ఉన్న అర్జీ రూపంలో గౌరవ జడ్జి గారికి ఇచ్చిన మీ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తామని తెలిపారు. మరిన్ని వివరాలకు 15100 నెంబర్ కు డయల్ చేసిన ఉచిత సలహాలు, సూచనలు తెలుసుకోవాలని కోరారు
No comments:
Post a Comment