ముక్కంటిని దర్శించుకున్న ఆంధ్రప్రదేశ్ పంచాయతీ శాఖ మంత్రి పూడి ముత్యాల నాయుడు
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానమునకు ఆంధ్రప్రదేశ్ పంచాయతీ శాఖ రూరల్ డెవలప్మెంట్ మంత్రి పూడి ముత్యాల నాయుడు స్వామి అమ్మవార్ల దర్శనార్థమై ఆలయానికి విచ్చేశారు. వారికి శ్రీకాళహస్తి దేవస్థానం పాలకమండలి చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు వేద పండితుల వారిచే పూర్ణకుంభంతో స్వాగతం పలికి స్వామి అమ్మవార్ల ప్రత్యేక దర్శనం చేయించారు. అనంతరం శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక సమేత శ్రీ వాయులింగేశ్వర స్వామి ఆలయంలో స్వామి అమ్మవార్ల ఉత్సవ ఊరేగింపులో పంచాయతీ శాఖ మంత్రి పాల్గొన్నారు. దర్శనానంతరం వారికి చైర్మన్ అంజూరు శ్రీనివాసులు శ్రీ గురుదక్షిణామూర్తి సన్నిధి వద్ద వేదపండితులతో ఆశీర్వచనాలు ఇప్పించి, శేష వస్త్రాలతో సత్కరించి స్వామి అమ్మవార్ల చిత్రపటాన్ని మరియు తీర్థ ప్రసాదాలను అందజేశార.
ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి గారి కుమార్తె పవిత్రా రెడ్డి మరియు పాలకమండలి సభ్యులు పసల సుమతి, ఆలయ అధికారులు ఏసి మల్లిఖార్జున ప్రసాద్, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరాజ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment