ప్రపంచబాలికా దినోత్సవ సంబరాలు జరపాలా??? ఉద్యమాలు చెయ్యాలా??? :చక్రాల ఉష
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
ప్రపంచబాలికా దినోత్సవ సంబరాలు జరపాలా??? ఆడబిడ్డలని కాపాడాలంటూ ఉద్యమాలు చెయ్యాలా???ఆంధ్ర రాష్ట్రం లో మహిళలకు రక్షణ లేదు రోజు రోజుకు అగాయత్యయాలు , అత్యాచారాలు హత్యలు నిత్యకృత్యం అయ్యాయి
తిరుపతి పార్లమెంట్ తెలుగు మహిళా అధ్యక్షురాలు చక్రాల ఉష ధ్వజమెత్తారు
ఆడబిడ్డలను ఇష్టానుసారంగా ప్రేమోన్మాదులు చంపేస్తుoటే ప్రభుత్వం మత్తువీడదా????
సమాజంలో రోజురోజుకు మృగాళ్లు పెరిగిపోతున్నారు .ప్రేమించడం లేదని మొన్న కాకినాడ లో అమ్మాయిని దారి కాసి గొంతు కోసి చంపేసాడు ఓ దుర్మార్గుడు. ఆడబిడ్డలు ఇంట్లో ఉన్న, స్కూల్ కి వెళ్లినా , కాలేజీ కి వెళ్లినా ఆఖరికి ఇళ్లల్లో ఉన్నా కూడా రక్షణ లేకుండా పోవడం ఈ వైసీపీ ప్రభుత్వ వైఫల్యం..,ఎక్కడ దక్కోవాలి,ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఆడబిడ్డలు, మహిళలూ? దిక్కుమాలిన దిశా చట్టాలు అంటూ ప్రసారాలు తప్ప, రక్షణ ఎక్కడ?, శిక్షలూ ఎక్కడ?నాడు నేను విన్నాను,నేను ఉన్నాను, నేను చూశాను అని మహిళలకు వాగ్దానం చేసిన జగన్ మోహన్ రెడ్డి ,అధికారంలోకి వచ్చాక మహిళలపై అత్యాచారాలు,దాడులు జరుగుతూ ఉంటే ఏ ఒక్కసారి కూడా స్పందించారా??? హోమ్ మినిస్టర్ గారు ఆడబిడ్డలకు రక్షణ కల్పించండి అంటే? ఆడపిల్లలపై అత్యాచారాలు జరగడానికి తల్లి కారణమంటూ తల్లిని తప్పు పడతారా? మహిళలకు రక్షణ కల్పించలేని వైసీపీ ప్రభుత్వానికి రాబోవు రోజుల్లో మహిళలు బుద్ధి చెప్తారూ?
No comments:
Post a Comment