ప్రగతి సంస్థ ఆద్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ బాలికల దినోత్సవం
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
ప్రతీ సంవత్సరం అక్టోబర్ 11వ తేదీని అంతర్జాతీయ బాలికల దినోత్సవంగా జరుపుకోవడం జరుగుచున్నది, సమాజంలో ఆడబిడ్డలపై ఉండే వివక్షతను, హింసను, బాల్యవివాహాల వల్ల కలిగే నష్టాల గురించి అవగాహన కల్పించేందుకు ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఆడబిడ్డల ప్రాముఖ్యతను సమాజానికి చాటి చెప్పేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుచున్నది. ప్రగతి సంస్థ, తిరుపతి వారి ఆద్వర్యంలో ముచ్చువోలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు ఘనంగా అంతర్జాతీయ బాలికల దినోత్సవం నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమానికి అద్యక్షత వహించిన పాఠశాల ఛైర్మన్ గురునాధ రెడ్డి మాట్లాడుతూ బాలికలు తమ లక్ష్యాన్ని చేరుకోవడానికి వారి ముందున్న సవాళ్లపై దృష్టి సారించి ముందుకు వెళ్లాలని కోరారు. ప్రధాన ఉపాద్యాయులు గోపినాద్ గారు మాట్లాడుతూ ప్రతీ ఏటా అంతర్జాతీయ బాలికల దినోత్సవాన్ని ఒక ప్రత్యేక ధ్యేయం తో నిర్వహిస్తుంటారు. ఈ ఏడాదికిగాను ‘ఇది మన సమయం, మన హక్కులు, మన భవిష్యత్తు’ అనే ధ్యేయం తోనిర్వహించడం జరుగుచున్నదని తెలిపారు. ప్రగతి మండల కోఆర్డినేటర్ రామచంద్ర మాట్లాడుతూ వాతావరణ మార్పులు, కోవిడ్ 19 మహమ్మారి తర్వాత మానవ సంబంధాల్లో ఏర్పడ్డ సంఘర్షణల నేపథ్యంలో బాలికలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బాలికలు విద్య, శారీరక, మానసిక సమస్యలతో బాధపడుతున్నారు. వీటన్నంటిపై ప్రజల్లో అవగాహన తీసుకురావాలనే లక్ష్యంతో అంతర్జాతీయ బాలికల దినోత్సవాన్ని జరుపుతున్నారు అని తెలిపారు. ఈ దినోత్సవాన్ని పురస్కరించుకొని బాలికలకు సంబంధించిన స్ఫూర్తిదాయకమైన కథనాలను, వీడియోలను అందరితో పంచుకోని సమాజంలో వారికి ఉన్నత స్థానం కల్పించవలసిన భాద్యత ప్రతి ఒక్కరిది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రగతి సిబ్బంది శివా రెడ్డి, సిఆర్పి ధణశేకర్, సుమతి, ఉపాద్యాయులు చిరంజీవి, లలిత మరియు నరసింహ పాల్గొన్నారు.
No comments:
Post a Comment