ప్రపంచం గర్వించదగ్గ గొప్ప శాస్త్రజ్ఞుడు డా"ఏ.పీ.జే.అబ్దుల్ కలాం:షేక్.సిరాజ్ బాషా - స్వర్ణముఖి న్యూస్

 స్వర్ణముఖి న్యూస్

NEWS

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, October 16, 2022

ప్రపంచం గర్వించదగ్గ గొప్ప శాస్త్రజ్ఞుడు డా"ఏ.పీ.జే.అబ్దుల్ కలాం:షేక్.సిరాజ్ బాషా

 ప్రపంచం గర్వించదగ్గ గొప్ప శాస్త్రజ్ఞుడు డా"ఏ.పీ.జే.అబ్దుల్ కలాం




 స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :


పట్టణంలోని 16వ వార్డు కుమారస్వామి తిప్పలోని అంగన్వాడీ కేంద్రంలో శనివారం జైభీమ్ ప్రజాసంరక్షణ సమితి ఆధ్వర్యంలో అక్టోబర్15 భారతరత్న మాజీ రాష్ట్రపతి మిస్సెల్ మాన్ డా"ఏ.పీ.జే. అబ్దుల్ కలాం జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వైసీపీ ముస్లిం మైనారిటీ సెల్ రాష్ట్ర కార్యదర్శి షేక్.సిరాజ్ బాషా విచ్చేసి, బడిలో అబ్దుల్ కలాం జన్మదిన వేడుకలను పురస్కరించుకుని, కేక్ కట్ చేశారు. బడిలో ఇచ్చే గుడ్లు పిల్లలు తినేందుకు ఆస్కారంగా  కప్ లను, మిఠాయి పంచి పెట్టారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ,

ఏ.పి.జె. అబ్దుల్ కలామ్ భారత దేశానికి 11వ రాష్ట్రపతి అని చెప్పారు. అదేకాకుండా ప్రపంచ దేశాలు గర్వించదగ్గ క్షిపణి శాస్త్రవేత్త అని అన్నారు.ఆయన పూర్తిపేరు అవుల్ పకీర్ జైనులబ్దీన్ అబ్దుల్ కలామ్ అని తెలిపారు.ఈ వేడుకలను పిల్లలతో  జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని ఆయన చెప్పారు. తమిళనాడు లోని రామేశ్వరంలో పుట్టి పెరిగరని తిరుచిరాపల్లి లోని సెయింట్ జోసెఫ్ కళాశాలలో భౌతిక శాస్త్రం అభ్యసించారన్నారు.అదేవిధంగా జైభీమ్ ప్రజాసంరక్షణ సమితి అధ్యక్షులు షేక్.కరీముల్లా మాట్లాడుతూ, డా"ఏ.పీ.జే.అబ్దుల్ కలాం  ఇస్రోలో 1980లో రోహిణి ఉపగ్రహాన్ని కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టి, శాటిలైట్ లాంచ్ వెహికల్ 

(ఎస్.ఎల్.వి) ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా ఉన్నారని చెప్పారు.ఇది భారతదేశపు మొట్టమొదటి 

ఎస్.ఎల్.వి.పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (పిఎస్‌ఎల్‌వి) అభివృద్ధికి కూడా కలాం కృషి చేశారని తెలిపారు.

అతను ఎస్.ఎల్.వి. సాంకేతికత నుండి బాలిస్టిక్ క్షిపణులను అభివృద్ధి చేయడానికి ప్రాజెక్ట్ వాలియంట్ మరియు ప్రాజెక్ట్ డెవిల్ అనే రెండు ప్రాజెక్ట్‌లకు డైరెక్టర్‌గా కూడా ఉన్నారని చెప్పారు.ఈ కార్యక్రమంలో వైసీపీ16వ వార్డ్ ఇంచార్జ్ షేక్.ఫజల్.సంఘసేవకర్త షేక్.దిలీప్.మెగూమి స్కూల్ హెడ్ మాస్టర్ ప్రేమ కుమార్.షేక్.ఇస్మాయిల్.అంగన్వాడీ టీచర్లు పిల్లల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad