ప్రజాస్వామ్యంలో దాడుల సంస్కృతిని "బీజేపీ - జనసేన" పార్టీలు సమర్దించవు! ప్రోత్సహించవు...
జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి విశాఖపట్నం పర్యటనలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తల అక్రమ అరెస్టులను ఖండించిన బిజెపి రాష్ట్ర మీడియా ప్రతినిధి కోలా ఆనంద్
నిన్నటి రోజున వైజాగ్ లో బిజెపి మిత్రపక్షమైన జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ మరియు పార్టీ నాయకులు, కార్యకర్తలు ర్యాలీవచ్చే మార్గంలో వైకాపా మంత్రులను పోలీసులు ఎందుకు అనుమతించారు?
ప్రజా సభల్లో విద్వేష పూరిత ప్రసంగాలు,తరువాత కృత్రిమ ఉద్యమాలు, ఇవేవి పనిచేయక పోవడంతో "మంత్రుల పై దాడి డ్రామా" ఇవన్నీ కూడా వైకాపా నాయకులు ప్రణాళిక బద్దంగా చేస్తున్నారు. కోడి కత్తి డ్రామా లాగా మరో కొత్త నాటకాన్ని విశాఖ వేదికగా YSRCP పార్టీ మొదలు పెట్టింది.
జనసేన పార్టీ కార్యకర్తలు, నాయకుల అక్రమ అరెస్టులు వెంటనే ఉపసంహరణ చేసుకుని, వారిని భేషరతుగా విడుదల చేయాలి. ప్రజాస్వామ్యంలో పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. దాడి చేశారనే సాకు చూపించి జనసేన కార్యకర్తలను రాత్రికి రాత్రి అరెస్టులు చేసి ఆ ప్రాంతంలో భయనక వాతావరణాణ్ణి సృష్టించారు.... మరి వందలాది హిందూ దేవాలయాలను కూలగొడితే ఒక్కటంటే ఒక్క అరెస్ట్ చేయలేదే? దేవాలయాలపై దాడులు పట్టవు కానీ ఇలా ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలపై కక్ష సాధింపుకు మాత్రం సిద్ధంగా ఉంటున్న హిందూ వ్యతిరేక పార్టీ వైసిపి.
మంత్రుల పై దాడులు చేశారని వైకాపా నాయకులు మాత్రమే ఆరోపిస్తున్నారు. పోలీసులు నిర్దారించ లేదు. జనసేన నాయకులను, కార్యకర్తలను బేషరతుగా విడిచిపెట్టాలి
జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆత్మస్టైర్యాన్ని కోల్పోవద్దు. పవన్ కళ్యాణ్ గారి వెంట బిజెపి పార్టీ ఎప్పుడూ ఉంటుంది.
ఈ రాష్ట్ర ప్రభుత్వము, పోలీస్ వ్యవస్థను అడ్డుపెట్టుకొని చేస్తున్న అకృత్యలను, రాష్ట్ర బిజెపి నాయకత్వంతో కలసి పూర్తి సాక్ష్యాలతో కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా గారి దృష్టికి తీసుకు వెళ్తాము అని శ్రీ కోలా ఆనంద్ గారు తెలియజేశారు...
No comments:
Post a Comment