నిత్యాన్నదాన పథకమునకు విరాళంగా రూ. 9,84,000/- ( తొమ్మిది లక్షల ఎనభై నాలుగు వేల రూపాయలు)
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
తల్లి జ్ఞానప్రసూనాంబ సమేత వాయులింగేశ్వరుడు కొలువైవున్న శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం నందు రాహుకేతు సర్పదోష నివారణ పూజ నిమిత్తం గణపవరం, వెస్ట్ గోదావరి వాస్తవ్యులు, U. S. కాలిఫోర్నియా నందు స్థిరపడిన స్వచ్ఛ జలదాత శ్రీమతి & శ్రీ అనంతకోటిరాజు దంపతులు వారి కుటుంబ సభ్యులతో కలిసి దేవస్థానమునకు విచ్చేశారు. వారికి శ్రీకాళహస్తీశ్వరస్వామి వారి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ అంజూరు తారక శ్రీనివాసులు స్వాగతం పలికి స్వామి అమ్మవార్ల ప్రత్యేక దర్శనం చేయించారు. సర్ప దోష నివారణ పూజ, స్వామి అమ్మవార్ల దర్శనానంతరం వారికి చైర్మన్ అంజూరు శ్రీనివాసులు దేశం నలుమూలల నుంచి విచ్చేయు భక్తులకు నాణ్యత కలిగిన అన్న ప్రసాదం అందించు నిత్య అన్నదాన పథకం గూర్చి క్లుప్తంగా వివరించి విరాళమును కోరగా, స్వచ్ఛ జలదాత, అనంత కోటి రాజు రూ. 9,84,000/- ( తొమ్మిది లక్షల ఎనభై నాలుగు వేల రూపాయలు) నిత్యాన్నదాన పథకమునకు విరాళంగా అందించారు. ఈ సందర్భంగా చైర్మన్ అంజూరు శ్రీనివాసులు పేదలకు, భక్తులకు నిర్వహించే అన్నదాన పథకమునకు విరాళం అందజేసిన మీకు మీ కుటుంబ సభ్యులకు తల్లి జ్ఞాన ప్రసూనాంబ సమేత వాయులింగేశ్వరుని యొక్క చల్లని దీవెనలు ఎల్లవేళలా ఉండాలని తెలియజేసి, కృతజ్ఞతలతో పాటూ వారికి శేష వస్త్రాలతో సత్కరించి, స్వామి-అమ్మవార్ల చిత్రపటాన్ని మరియు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాలకమండలి సభ్యులు పసల సుమతి, ఆలయ అధికారి మల్లికార్జున ప్రసాద్, శ్రీనాథ్, బాలాజీ, మరియు కోళ్లూరు హరి నాయుడు, బాల గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment