గాంధీ జయంతి పురస్కరించుకొని తెలుగుదేశం పార్టీ వినతి పత్రం - స్వర్ణముఖి న్యూస్

 స్వర్ణముఖి న్యూస్

NEWS

Breaking

Home Top Ad

Post Top Ad

Monday, October 3, 2022

గాంధీ జయంతి పురస్కరించుకొని తెలుగుదేశం పార్టీ వినతి పత్రం

 గాంధీ జయంతి పురస్కరించుకొని తెలుగుదేశం పార్టీ   వినతి పత్రం




 స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :


మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు  నారా చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు మరియు శ్రీకాళహస్తి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి  బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి సూచనల మేరకు శ్రీకాళహస్తి పట్టణమునందు గాంధీ జయంతి సందర్భంగా  గాంధీ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలవేసి వినతి పత్రం సమర్పించడం జరిగినది

 ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు జి విజయకుమార్ మాట్లాడుతూ

ఆనాడు గాంధీజీ గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందని స్వచ్ఛమైన భారతదేశం ఉన్నప్పుడే సంపూర్ణమైన ఆరోగ్య దేశంగా ఉంటుందని గ్రామ స్వరాజ్యాన్ని ఏర్పాటు చేసిన మహనీయుడు అని అదే బాటలో యుగపురుషుడు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు ఈ ఆంధ్ర రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలు పడుతున్న బాధలను గమనించి బడుగు బలహీన వర్గాల వారిని ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా అభివృద్ధి చేయాలని సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించి మహిళలకు సమాన ఆస్తి హక్కు చట్టసభలలో 33 శాతం రిజర్వేషన్ కూడు గుడ్డ విద్యా వైద్యం అలాగే పేదలకు రెండు రూపాయలకు కిలో బియ్యం మరియు అనేక సంక్షేమ పథకాలను అందించిన మహనీయుడని వారిని ఆదర్శంగా తీసుకొని  నారా చంద్రబాబునాయుడు  ఆంధ్ర రాష్ట్రం విడిపోయి 16,500 కోట్ల లోటు బడ్జెట్ ఉన్న బడుగు బలహీన వర్గాల వారికి ఎన్నో రకాల సంక్షేమ పథకాలను అందించిన మహనీయుడని మరి ఈ వైయస్సార్సీపి ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామ సర్పంచ్ లకు వచ్చే నిధులను కూడా పక్కదారి పట్టించి సర్పంచులకు గ్రామాలలో విలువ లేకుండా చేయడం అన్ని వర్గాల ప్రజలను రోడ్డుపైకి లాగి నిత్యవసర వస్తువులను ఆకాశానంటే విధంగా పేదవాడు కడుపునిండా మూడు పూట్ల తినే స్థితిలో లేకుండా చేసిన ఏకైక పార్టీ వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అని ప్రజలందరూ ఈ ప్రభుత్వ ఆలోచనలు అరాచకం భూకబ్జాలు ఇసుక దోపిడీ నిరుద్యోగం వంటివి గమనిస్తున్నారని త్వరలో ప్రజలే బుద్ధి చెబుతారని తెలియజేసినారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి దశరదాచారి, చలపతి నాయుడు, రేణుకమ్మ, రాష్ట్ర మైనారిటీ విభాగం షాకీర్యాలీ రాష్ట్ర ఎస్సీ సెల్ విభాగం  గోపీనాథ్ రాష్ట్ర  సాంస్కృతిక విభాగం నెమలిలూరు సుబ్రహ్మణ్యం తిరుపతి పార్లమెంటు కోశాధికారి కంఠ రమేష్ తిరుపతి పార్లమెంటు రైతు ఉపాధ్యక్షుడు ప్రకాష్ రావు తిరుపతి పార్లమెంటు ఎస్టీ సెల్ అధ్యక్షుడు సుబ్బయ్య తిరుపతి పార్లమెంటు మైనారిటీ విభాగం జిలాని భాష, మాజీ కౌన్సిలర్లు మునికృష్ణ, ప్రసాద్ రావు, దుర్గాప్రసాద్ , షేక్ బషీర్ ,పట్టణ ప్రధాన కార్యదర్శి మిన్నల్ రవి, మాజీ దేవస్థానం సభ్యులు  గుర్రప్ప శెట్టి  మాజీ పట్టణ టిడిపి అధ్యక్షులు అద్దంకి డాంగే పట్టణ యువత అధ్యక్షులు అద్దంకి హేమంత్ కుమార్ మాజీ టౌన్ బ్యాంక్ అధ్యక్షులు డివి నారాయణ మాజీ టౌన్ బ్యాంకు సభ్యులు ఖాదర్బాషా, పట్టణ బీసీ అధ్యక్షులు పోలూరు శ్రీనివాసులు రెడ్డి, ధనుంజయులు, పట్టణ మైనారిటీ అధ్యక్షులు షఫీ, చాంద్ బాషా ధనుంజయ నాయుడు, మోహన్, ఆర్ముగం ,దొరబాబు, ఎమ్మెస్ రెడ్డి ప్రవీణ్ , ఖాదర్ బాషా, గంధమనేని రాజేందర్ నాయుడు, వినయ్, ముని రాజా యాదవ్, రమేష్, గోవిందు, రామచంద్రయ్య, నారాయణ, వెంకయ్య,  సురేష్ నాయుడు  దుర్గ, రమేష్ తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad