మా చెరువును అక్రమార్కుల చేతినుండి కాపాడండి : రామచంద్రాపురం ప్రజలు
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
శ్రీకాళహస్తి నియోజవర్గంలొనీ తొట్టంబేడు మండల పరిధిలోని రామచంద్రాపురం చెరువును అక్రమార్కులు చెరపట్టారు. ఇప్పటికే ఈ చెరువులో చాలామంది అక్రమంగా నిర్మాణాలు చేశారు. అధికారులు మౌనంగా ఉండటంతో అక్రమార్కులు చెలరేగి పోతున్నారు. పగలు, రాత్రి తేడా లేకుండాచెరువులో అక్రమ నిర్మాణాలు చేస్తున్నారు. తొట్టంబేడు రెవిన్యూ కార్యాలయానికి కూతవేటు దూరంలోనే ఈ ఆక్రమణలు జరుగుతు న్నప్పటికీ అధికార యంత్రాంగం అడ్డుకోక పోవడం అనుమానాలకు తావిస్తోంది.అధికారుల మొద్దు నిద్ర కారణంగా రూ. కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమిపరాధీనమవుతోంది.శ్రీకాళహస్తి-పిచ్చాటూరు ప్రధాన రహదారి పక్కనే సర్వే నంబరు:74-1లో 18 ఎకరాలు, సర్వే నంబరు: 74-2లో రెండుఎకరాలు మొత్తం 20 ఎకరాల విస్తీర్ణంలో రామచంద్రాపురం చెరువుఉంది. ఈ చెరువు శ్రీకాళహస్తి పట్టణం సమీపంలోనేరామచంద్రాపురం గ్రామాన్ని శ్రీకాళహస్తి పురపాలక సంఘంలోకి విలీనంచేయాలని అధికారులు ప్రతిపాదనలు పంపారు. ఇందుకు ప్రభుత్వంకూడా అంగీకరించింది. ఇందుకు సంబంధించి అధికారిక ఉత్తర్వులురావాల్సి ఉంది. రామచంద్రాపురం గ్రామాన్ని పురపాలక సంఘంలోకివిలీనం చేస్తుండటంతో ఇక్కడ భూముల ధరలు బాగా పెరిగాయి. ఇక్కడ ఉన్న ప్రభుత్వ స్థలాలపై కబ్జాదారుల కన్ను పడింది. రామ చంద్రాపురంపక్కనే 20 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న చెరువును కొందరు ఆక్రమించడచంమొదలు పెట్టారు. కొంతకాలంగా చెరువులో అక్రమ కట్టడాలు నిర్మిస్తున్నారు. చెరువు భూమిలో కట్టుకున్న ఇళ్లకు కూడా విద్యుత్ శాఖ అధికారులు విద్యుత్ కనెక్షన్లు ఇచ్చేశారు. ఇందుకు కొంత మంది రెవిన్యూ ఉద్యోగులు సహకరించారు. రెవిన్యూశాఖ వారు మౌనంగా ఉండటంతో రామచంద్రాపురం చెరువును రెండేళ్ల వ్యవధిలోనే సగానికి పైగా ఆక్రమించారు.ఇందుకు గతంలో ఇక్కడ పని చేసి సస్పెన్షన్ కు గురైన ఓ తహసీల్దారుపూర్తి సహకారం అందించారనే ఆరోపణ ఉంది. చెరువు భూమికి సైతంఈయన పట్టాలు ఇచ్చారనే అభియోగం ఉంది. ఈ ఆక్రమణలపై కథనాలు రావడంతో అక్రమార్కులు కొంతకాలం మిన్నకుండి పోయారు. ఇటీవల కొన్ని రోజులుగా రామచంద్రాపురం చెరువులో అక్రమనిర్మాణాలు చేస్తున్నారు. ప్రజలు ఎవరైనా ఫిర్యాదు చేస్తే రెవిన్యూ అధికారులు వెళ్లి తాత్కాలికంగా పనులు ఆపుతారు. లేదంటే ఏమీ తెలియనట్లుఉండిపోతున్నారు. రెవిన్యూ శాఖ వారు ఇలా పరోక్షంగా సహకారం అందిస్తుండటంతో అక్రమార్కులు బహిరంగంగా నిర్మాణాలుచేస్తున్నారు.ఫలితంగా రామచంద్రాపురం చెరువు పూర్తిగా కనుమరుగు అవుతోంది.అధికారులు ఇకనైనా స్పందించి రామచంద్రాపురం చెరువులో అక్రమకట్టడాలు తొలగించి... చెరువును కాపాడాల్సి ఉంది. ఇక్కడ ఆక్రమణలుతొలగిస్తే ఈ భూమి భవిష్యత్తులో ప్రభుత్వ అవసరాలకువినియోగించుకోవచ్చు. ఆదిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
No comments:
Post a Comment