కార్తీక మాసంలో వనభోజనం పంపిణీ చేశారు. : దేవస్థానం చైర్మన్
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
శ్రీకాళహస్తి భరద్వాజతీర్థంలో అవధూత శ్రీ వేణుగోపాల స్వామి ఆరాధన మహోత్సవంలో శ్రీకాళహస్తి దేవస్థానం చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక ఆరాధన మహోత్సవ కమిటీ సభ్యులు గరికపాటి చంద్రశేఖర్, గరికిపాటి రమేష్ బాబులు దేవస్థానం చైర్మన్ కు స్వాగతం పలికి అవధూత వేణుగోపాలస్వామి సమాధి దర్శనం చేయించారు. అనంతరం ఆలయ చైర్మన్
అంజూరు తారక శ్రీనివాసులు ఆరాధన ఉత్సవం సందర్భంగా ఏర్పాటుచేసిన వనభోజన కార్యక్రమాన్ని ప్రారంభించి భక్తులకు పంపిణీ చేశారు. చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు మాట్లాడుతూ విశిష్టమైన కార్తీకమాసం మొదటి సోమవారం వేణుగోపాలస్వామి ఆరాధన ఉత్సవంలో భాగంగా వనభోజన కార్యక్రమం పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం హర్షనీయమన్నారు. అన్నం పరబ్రహ్మ స్వరూపమని ప్రధానంగా కార్తీక మాసంలో వనభోజనం చేయడం ఎంతో శ్రేష్టకరమని పురాణాలు చెబుతున్న దృష్ట్యా ఎవరికి వారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కార్తీక మాసం అంతా విరివిరిగా వనభోజనాలు ఏర్పాటు చేసి భక్తులకు అన్నప్రసాదాలు వితరణ చేయాలని పిలుపునిచ్చారు. కార్తీక మాసంలో భక్తులందరికీ పరమేశ్వరుని అనుగ్రహం లభించి సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. పెద్ద ఎత్తున వనభోజన కార్యక్రమాలు ఏర్పాటు ఏర్పాటుచేసిన గరికిపాటి కుటుంబం సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.
అంజూరు తారక శ్రీనివాసులు స్థానిక భక్తులతో కలిసి వనభోజన ఈ కార్యక్రమంలో గరికపాటి సుధాకర్ బాబు గరికిపాటి రమేష్ బాబు గరికిపాటి చంద్రశేఖర్ బాబు సెన్నేరు కుప్పం శేఖర్ అంజురు వెంటేష్ బాబు రామకృష్ణ రాధా మద్దు వాసు యాదవ్ సురేష్ గాలి గిరినాయుడు బుగ్గ ప్రసాద్ జంబు గోళం లోకేష్ బాలాజీ కార్తీక్ ఆచారి తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment