శ్రీశ్రీశ్రీ కన్యాకాపరమేశ్వరి నవరాత్నాల హారతి పాల్గొన్న అంజూరు తారక శ్రీనివాసులు
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శ్రీకాళహస్తి పట్టణం, బహదూర్ పేటలో వెలసిన శ్రీశ్రీశ్రీ కన్యాకాపరమేశ్వరి అమ్మవారి ప్రత్యేక నవధాన్యాలు మరియు నవరాత్నాల హారతి మహోత్సవంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం పాలకమండలి చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు . వారికి ఆలయ నిర్వాహకులు ఘనంగా స్వాగతం పలికి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించినారు. తదనంతరం అమ్మవారి వద్ద పూజించిన వస్త్రంతో చైర్మన్ అంజూరు శ్రీనివాసులు గారిని సత్కరించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయ నిర్వహకులు మరియు స్థానిక మహిళలు పెద్దఎత్తున పాల్గొన్నారు.
No comments:
Post a Comment