శ్రీకాళహస్తిలో ఘనంగా ముగిసిన 8th సీనియర్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ బాల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ టోర్నమెంట్ - స్వర్ణముఖి న్యూస్

 స్వర్ణముఖి న్యూస్

NEWS

Breaking

Home Top Ad

Post Top Ad

Monday, October 3, 2022

శ్రీకాళహస్తిలో ఘనంగా ముగిసిన 8th సీనియర్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ బాల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ టోర్నమెంట్

 శ్రీకాళహస్తిలో ఘనంగా ముగిసిన 8th సీనియర్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ బాల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ టోర్నమెంట్











 స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :


¶హోరాహోరీగా సాగిన ఫైనల్ మ్యాచ్.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ,విన్ టీవీ చైర్మన్ డాక్టర్ టి దేవానాథన్ యాదవ్ ,దేవస్థానం చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు  పాల్గొన్నారు.

ఉమ్మడి చిత్తూరు జిల్లా బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంతర్ జిల్లాల రాష్ట్ర స్థాయి బాల్ బ్యాడ్మింటన్ ఫైనల్ పోటీలు శ్రీకాళహస్తి జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల క్రీడామైదానం నందు మూడు రోజులు పాటు నిర్వహించి నేటితో ముగిశాయి. 

ఈ క్రీడల్లో పురుషుల విభాగంలో ప్రథమ బహుమతి చిత్తూరు జిల్లా, ద్వితీయ బహుమతి ప్రకాశంజిల్లా, తృతీయ బహుమతి విశాఖ జిల్లా,నాలుగో బహుమతి నెల్లూరు క్రీడాకారులు గెలుపొందారు. అలాగే మహిళ విభాగంలో మొదటిబహుమతి వైజాగ్ ,రెండవ బహుమతి నెల్లూరు,తృతీయ బహుమతి ఈస్ట్ గోదావరి,నాలుగో బహుమతి విజయనగరం గెలుపొందారు.క్రీడల్లో రాణించిన ప్రధమ, ద్వితీయ ద్వితీయ, క్రీడాకారులకు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మరియు ఇతర అతిథులు బహుమతులను క్రీడాకారులకు అందజేశారు.   

అలాగే ఫైనల్ మ్యాచ్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి గెలుపొందిన జట్లకు SAAP డైరెక్టర్ 10 వేల రూపాయలు నగదు అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, క్రీడల్లో రాణించిన క్రీడాకారులకు అభినందనలు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుందని, ప్రతిఒక్క క్రీడాకారుడు క్రీడల్లో రాణించి రాష్ట్రానికి అలాగే దేశానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు. క్రీడల పరంగా ఎవరికి ఏ సహాయం కావాలన్నా సహాయం చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని అలాగే రానున్న రోజుల్లో శ్రీకాళహస్తిలో ఇంటర్నేషనల్ క్రీడా మైదానం కూడా రానుందని తెలిపారు.అలాగే ప్రతి ఒక్కరు జీవితంలో ఏదో ఒక స్పోర్ట్స్ అలవాటు పరుచుకోవాలని దాని వలన మనము మానసిక ఉల్లాసం పొందుతామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో బాల్ బ్యాట్మెంటన్ జిల్లా అసోసియేషన్ ప్రెసిడెంట్ వెంకటస్వామి,SAAP డైరెక్టర్ వీర రాఘవరెడ్డి,బోర్డు మెంబర్స్ మున్నా రాయల్, జై శ్యామ్ రాయల్, విద్యా కమిటీ చైర్మన్ శంకర్,శ్రీనివాసులు రెడ్డి,కిషోర్,చంద్ర,గోపి,సుబ్రహ్మణ్యం,నరేష్,సుధీర్ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad