శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం కైలాస సదన్ అతిథి గృహానికి 8 లక్షలు విరాళం - స్వర్ణముఖి న్యూస్

 స్వర్ణముఖి న్యూస్

NEWS

Breaking

Home Top Ad

Post Top Ad

Thursday, October 13, 2022

శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం కైలాస సదన్ అతిథి గృహానికి 8 లక్షలు విరాళం

 శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం కైలాస సదన్  అతిథి గృహానికి 8 లక్షలు విరాళం


 స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :


శ్రీకాళహస్తి దేవస్థానం అనుబంధమైన భరద్వాజ తీర్థం (లోబావి) నందు భక్తులకు బస సౌకర్యార్థం నూతనంగా నిర్మించి ప్రారంభించిన 125 గదుల కైలాస సదన్ అతిథి గృహం నందు దాతలు భాగస్వామ్యం అయ్యేలా దేవస్థానం విరాళాల స్వీకరణ కొనసాగిస్తున్నది. ఈ సందర్భంగా శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం చైర్మన్ అంజూరు  శ్రీనివాసులు గారికి రాజమండ్రికి చెందిన చందన కోటేశ్వరరావు (స్మార్ట్ సిటీ కార్పొరేషన్ ఛైర్మన్)  వారి కుటుంబ సభ్యులతో కలిసి స్వామి అమ్మవార్లు దర్శనార్థం విచ్చేశారు. వారికి ఆలయం ముందు ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు చేయించి ఆలయంలోని పలు సేవా కార్యక్రమాలు గూర్చి చైర్మన్ గారు తెలియజేయడం జరిగినది. ఇందులో భాగంగా నూతనంగా ఏర్పాటు చేసిన కైలాస సదన్ గదుల విరాళం గూర్చి వారిని ఛైర్మన్ కోరడం జరిగినది. వెంటనే వారు సానుకూలంగా స్పందించి వారి తల్లిదండ్రులైన చందన రమేష్ (మాజీ ఎమ్మెల్యే ) - చందన వీర వెంకటలక్ష్మి గార్ల పేరిట అతిథి గృహంలోని ఒక సింగల్ రూముని విరాళంగా 8 లక్షల రూపాయలు చెల్లించి దాతగా భాగస్వాములు అవుతామని వారి దాతృత్వం చాటుకున్నారు.  వారికి దేవస్థానం చైర్మన్ అభినందనలు తెలియజేసి, ఘనంగా శేష వస్త్రములతో సత్కరించి, స్వామిఅమ్మవార్ల చిత్రపటాన్ని మరియు తీర్థప్రసాదాలను అందజేసి తల్లి జ్ఞానప్రసూనాంబ సమేత వాయు లింగేశ్వరుని యొక్క చల్లని దీవెనలు మీ కుటుంబానికి ఎల్లవేళలా ఉంటాయని తెలియజేశారు. అనంతరం దాతలు నేడు తిరుపతికి చెందిన రెడ్డి ద్వారా దేవస్థానం చైర్మన్ అంజూరు శ్రీనివాసులు సమక్షంలో దేవస్థానం అధికారులకు 8 లక్షల చెక్కును అందజేశారు. 

ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ అంజూరు శ్రీనివాసులు మాట్లాడుతూ శ్రీకాళహస్తి దేవస్థానం ఆధ్వర్యంలో నూతనంగా ప్రారంభించిన కైలాస సదన్ అతిథి గృహాల సముదాయం నందు గల రెండు బ్లాక్స్ లోని 125 గదుల్లో 101 సింగిల్ రూమ్స్,  24 సూటు రూమ్స్ ఉన్నాయని,  ఒక్కొక్క సూట్ రూమ్ కు  15 లక్షలు చొప్పున,  ఒక్కొక్క సింగిల్ రూమ్ కు  8 లక్షలు చొప్పున దాతలు విరాళం చెల్లించి స్వామిఅమ్మవార్ల సేవలో భాగస్వామ్యం అయ్యేవిధంగా దేవస్థానం అవకాశం కల్పించిందన్నారు.  దాతలు ఈ సదావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విరాళంగా పొందిన గదులను దాతల కుటుంబాలకు మరియు వారు తెలియజేసిన వారికి ఒక్కక్క సంవత్సరానికి 30 రోజుల చొప్పున ఉచితంగా బస వసతి కల్పించడం జరుగుతుందని, దేవస్థానం అతిథి గృహాల్లో దాతలకు భాగస్వామ్యం అయి ఆ కైలాసనాధుని సేవలో తరించే విధంగా దాతలకు అవకాశం కల్పిస్తున్నట్లు కోరిన విధంగానే దాతలు ముందుకొస్తున్నారని, ఈ క్రమంలోనే రాజమండ్రి కి చెందిన మరొక దాత అయిన చందన నాగేశ్వరావు గారు వారి కుటుంబ సభ్యులతో కలిసి మరొక గదికి విరాళంను అందజేసి స్వామి అమ్మవార్ల కృపకు పాత్రులయ్యారని తెలియజేశారు. అదేవిధంగా మన ప్రాంత వాసులు ముందుకు రావాలని, ఇతర ప్రాంతాల భక్తులకు కూడా తెలియజేసి శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి సేవలో పాల్గొనింపజేయాలని తెలియజేశారు. 

ఈ కార్యక్రమంలో వైయస్ఆర్సీపీ పార్టీ నాయకులు  పులి రామచంద్ర, సెన్నీరుకుప్పం శేఖర్, సూరి, బాబి తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad