శ్రీకాళహస్తి లో బొజ్జల సుధీర్ రెడ్డి రిలే నిరాహార దీక్ష
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరు మార్పు.. సీఎం జగన్ కుటిలబుద్ధికి నిదర్శనమని శ్రీకాళహస్తినియోజకవర్గం తెలుగుదేశంపార్టీ ఇన్చార్జ్ రెడ్డి విమర్శించారు శ్రీకాళహస్తి పట్టణంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద నిరసన ధర్నా చేపట్టారు
బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ..
వైద్య రంగానికి ఎంతోసేవ చేసినట్లు అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు వల్లెవేసిన ముఖ్యమంత్రి.. కనీసం ఆసుపత్రుల నిర్వహణకు నిధులు కూడా విడుదల చేయలేదని మండిపడ్డారు. 17 వైద్య కళాశాలలు కడుతున్నామన్న జగన్.. ఒక్కదానికైనా ఇటుక రాయితో శంకుస్థాపన వేశారా అని ప్రశ్నించారు. అసలు రాష్ట్రంలో ఎన్ని వైద్య కళాశాలలు ఉన్నాయో కూడా జగన్‌కు తెలియదని ఎద్దేవా చేశారు.ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన దగ్గరనుంచి అరాచకం రాజ్యమేలుతుందని,ఇష్టారాజ్య నిర్ణయాలతో ప్రజాగ్రహానికి గురై త్వరలోనే వైకాపా ప్రభుత్వం కనుమరుగవుతుందని చెప్పారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే తిరిగి ఆ మహనీయుని పేరు యూనివర్సిటీకి పెడతామని ఆయన తెలిపారు, మరి ఈ దీక్షకి పోలీసులు అడుగడుగునా అడ్డంకులు సృష్టించడం గమనార్హం, సుధీర్ రెడ్డి దీక్షకు పలు ప్రజా సంఘాలు,సీనియర్ ఎన్టీఆర్ అభిమానులు, మేధావులు, నాయకులు కార్యకర్తలు వచ్చి మద్దతు తెలిపారు, ఈ కార్యక్రమంలో రాష్ట్ర, పార్లమెంట్, మండల, పట్టణ, గ్రామ, వార్డ్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు
No comments:
Post a Comment